హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో పార్టీని బలోపేతం చేయడానికి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంత్రి లేదా సీనియర్ నాయకుడిని ఇన్చార్జ్గా నియమించిన సీఎం, రేపటి నుంచి మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో చేరికలను ప్రోత్సహిస్తూ, స్థానిక స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ రూపొందించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు ఈ విధంగా కేటాయించారు:
- మల్కాజిగిరి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- చేవెళ్ల – శ్రీధర్ బాబు
- కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
- ఖమ్మం – కొండా సురేఖ
- మహాబూబాబాద్ – పొన్నం ప్రభాకర్
- మహాబూబ్నగర్ – దామోదర రాజనర్సింహ
- జెహిరాబాద్ – అజారుద్దీన్
- మెదక్ – వివేక్
- నాగర్కర్నూల్ – వాకిటి శ్రీహరి
- నల్లగొండ – అడ్లూరి లక్ష్మణ్
- భువనగిరి – సీతక్క
- నిజామాబాద్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వరంగల్ – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు
- ఆదిలాబాద్ – సుదర్శన్ రెడ్డి (ప్రభుత్వ సలహాదారు)
ఈ వ్యూహాత్మక చర్యలతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేశారు.