హైదరాబాద్(APB News):
- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియా తో చిట్ చాట్
- కేంద్ర మంత్రి గడ్కరీ ని సీఎం రేవంత్ రెడ్డి కలసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై వివరించారు.
- ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును మొత్తం కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కోరాం.
- ముందు ల్యాండ్ సేకరించాలని కేంద్ర మంత్రి మాకు సూచించారు.
- దోచుకునే ,దాచుకునే ఆలోచన మాకు లేదు.
ఇష్టా రీతిన ప్రాజెక్టు కాస్ట్ పెంచారు కాబట్టే..7 వేల కోట్ల ప్రాజెక్టులో 12 వేల అవినీతి జరిగిందని కేటీఆర్ అంటుంన్నాడు. కేటీఆర్ లాగే అందరూ చేస్తారనుకుంటుంన్నారు. కేసీఆర్ లా ప్రతిపక్షం ను మేము లేకుండా చేయాలనుకోవడం లేదు.. బలమైన ప్రతిపక్షం ఉండాలనుకుంటుంన్నాం.
కేసీఆర్ ఎలాగూ బయటకు రాడు.. హరీష్ రావు, కేటీఆర్, కవిత వెళ్లి అయినా సమర్దవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచిదని సూచించారు.
2025లో అయినా బీఆర్ఎస్ నేతలకు జ్ణానోదయం కలగాలి. రైతు భరోసా విషయం లో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల రైతు బంధు లో 22 వేల కోట్ల రూపాయలు అనర్హులకు ఇచ్చారు.
ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ రోజు కో మాట మాట్లాడుతున్నాడు. ఓకరోజు సంబంధం లేదు అంటాడు…మరోక రోజు అధికారులకు సంబంధం లేదు..అంతా నేనే చేసాను అంటాడు. అధికారులకు సీరియస్ నెస్ తగ్గింది. బీఆర్ఎస్ లో సింగిల్ విండో ద్వారా ఆదేశాలు వెల్లెవి..ఇప్పుడు చాలా మంది నుంచి ఆదేశాలు వెల్తున్నాయి.పుష్ప అరెస్ట్ తో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారు అయ్యారని ఎంపీ చామల అన్నారు.