కోదాడ, ఏపీబీ న్యూస్: విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని సీబీఐ మాజీ డైరక్టర్ వి.వి లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కోదాడలో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సు కీలకమని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. కోదాడ వంటి పట్టణ ప్రాంతాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి, వారిని జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తయారుచేస్తున్న ఎన్ ఆర్ ఎస్ అకాడమీ కృషి అభినందనీయమన్నారు.
ప్రతిభ ఉన్నప్పటికీ రూరల్ ప్రాంత విద్యార్థులు సరైన ఫౌండేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్మీడియట్ లో రాణించలేక పోతున్నారన్నారు. దీనిని అధిగమించేందుకు వచ్చే విద్యా సంవత్సరంలో ఎన్ ఆర్ ఎస్ ఫౌండేషన్ స్కూల్ స్థాపించడం హర్షణీయమన్నారు. 8వ తరగతి నుండి ఐఐటీ, నీట్ లకు ఫౌండేషన్ క్లాసులు నిర్వహించి విద్యార్థులను జాతీయ స్థాయి ర్యాంకర్లుగా మార్చేందుకు, వారు జీవితం లో ఉన్నత స్థాయిలో రాణించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు తాము చదువున్న విద్యా సంస్థ కు అతిథిగా వెళ్ళడం గొప్ప విషయమని, దానిని విద్యార్థులు సాధించాలని కోరారు.