ఎమ్మెల్యే బత్తుల ఏంటిదీ..? ఎన్నికల కోడ్​కు వ్యతిరేకంగా హామీలు.. బీఆర్​ఎస్​ నేతలు ఫైర్

 మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడలో పాత హామీలకే దిక్కులేదంటే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కొత్త హామీలను ప్రకటిస్తూ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామే భయంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎమ్మెల్యే కొత్తగా ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మిర్యాలగూడలో బొండ్రాయి ప్రతిష్ట కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తామని, మహిళలకు రూ.2,116లో ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నిం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు మండిపడ్డారు.

అభ్యర్థులు ముద్రించిన కరపత్రాల పైన బొండ్రాయి ప్రతిష్ట విగ్రహాలను ముద్రించి సెంటిమ్మెంట్ను రాజేస్తున్నారని, మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు అని మభ్యపెడుతున్నారని ప్రజలు నమ్మెద్దని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి ప్రకటనలు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తదని, దీని పైన అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్లు, పార్టీ జరిపిన సర్వేల్లో కాంగ్రెస్కు మెజార్టీ రాదని తెలిసి కొత్త డ్రామా మొదలు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

Share
Share