ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన మండల కేంద్రాలు/ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి బిఆర్ఎస్ పిలుపు.
రాష్ట్రంలో 40 శాతం మంది రైతన్నలకు కూడా అందని రుణమాఫీ – కేటీఆర్
ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని మాటలు చెప్తుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారు.
అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలి. అప్పటిదాకా ప్రభుత్వం పైన పోరాటం ఆగదు. అందులో భాగంగానే ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.
రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు/నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవటంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు