దుర్గం చెరువులో 5 ఎకరాల భూమి కబ్జా..అందులో మాకు గజం జాగా లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: దుర్గం చెరువు ఆక్రమణపై తన మీద వస్తున్న వార్తలను కొట్టిపడేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అక్కడ ఉన్న భూమి మాదే దాన్నే పార్కింగ్ కోసం ఇవ్వడం జరిగింది. ఇవాళ వచ్చిన వార్త ఉత్త నిరాధారమైన వార్త, ఆక్షన్ పెడితే మేము కొనుక్కోవడం జరిగింది. 8 సంవత్సరాల క్రితమే టీడీఆర్ ఇచ్చారు. హీరో బాలకృష్ణకు, రేవంత్ రెడ్డి సోదరుడుకి కూడా అక్కడ భూమి ఉంది.

2010 Durgam Cheruvu

దుర్గం చెరువులో మేము ఏదో 5 ఎకరాల భూమి కబ్జా చేశాను అని కేసు పెట్టారు. అందులో మాకు గజం జాగా లేదు, ప్రభుత్వంకు కూడా గజం జాగా లేదు. అక్కడ అందరూ వాహనాల పార్కింగ్ పెట్టుకుంటారు. అక్కడే ఖాళీ స్థలంలో చెత్త డంప్ చేస్తారు. ఏదో హైడ్రా వాళ్లకు పిర్యాదు చేశారు అంట మా సిబ్బందికి ఫోన్ చేశారు నేను వెళ్తాను. ఆ పక్కన స్థలం నాదే 2004లో కొన్నాను. FTLలో ఉందని తెలిసి నేను రిటర్న్ ఇవ్వడం జరిగింది. కావాలని కేసు పెట్టారు.. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Share
Share