మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం మహేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు నాయక్ నాయక్ అధ్యక్షతన తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మహేశ్వరం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
మండల అధ్యక్షులు రాజు నాయక్ మాట్లాడుతూ మార్పు అనేది అభివృద్ధి లో చూపించాలి కాని విగ్రహాలు మార్చడం,పేర్లు మార్చడం కాదని ఈ విగ్రహాం తెలంగాణాను కించపరిచే లా పూర్తిగా కాంగెస్ తల్లిలా ఉందని ఎద్దేవాచేశారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోళ్ల చెంద్రయ్య మాట్లాడుతూ మార్పు మార్పు అంటూ కేసీఆర్ చేసిన పథకాలు,TS నుండి TG తెలంగాణ తల్లి విగ్రహాం ఇవి మార్చడం కాదు,మీకు సాధ్యమైతే ప్రజలకు మేలు చేసే అభివృద్ధిలో పనుల్లో మార్పు చెయ్యండి,ఇదివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాం తెలుగు విగ్రహానికి దీటుగా ఉండేదని అన్నారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపిటిసి లు సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ మార్కేట్ కమిటీ డైరెక్టర్లు అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మునగపాటి నవీన్, మంత్రి రాజేష్, స్వర్ణగంటి ఆనందం, జాన్ రెడ్డి, కర్నాటి మనోహర్, దుడ్డు కృష్ణ యాదవ్, ఆదిల్ అలీ, స్లీవా రెడ్డి, కాడమోని ప్రభాకర్, P బాలయ్య, రవి నాయక్, అంజయ్య గౌడ్, బొల్లాపాక యాదయ్య, పాండు నాయక్, మోహన్ నాయక్, మోతే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.