మహేశ్వరం(APB News):
మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వర రెడ్డిల ఆధ్వర్యంలో గురువారం మహేశ్వరం మండల కేంద్రంతో పాటు పలుగ్రామలలో గాంధి విగ్రహాలు, చిత్రపటాలకు వినతిపత్రాలు సమర్పణ.

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని,డిక్లరేషన్లు,హామీలు,గ్యారంటీల పేర్లతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 హామీలను అమలు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని మంచే పాండు యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం లోని పలు గ్రామాలలో ప్రజలు,నాయకులు, కార్యకర్తలతో కలిసి మహాత్మాగాంధీ కి వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు.
మహేశ్వరం గ్రామంలో

నాగారం గ్రామంలో

దుబ్బచెర్ల గ్రామంలో

కోళ్లపడకల్ గ్రామంలో
