కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టిన సబితమ్మ సైనికులు…తోక ముడిచి దొడ్డి దారిన పరార్..

సబితమ్మ బలం బలగం కార్యకర్తలే.. కబడ్దార్ కాంగ్రెస్ నాయకులారా…ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిస్తే తాట తీస్తాం:BRS కార్యకర్తలు.

మహేశ్వరం నియోజకవర్గం పరిధి, మహేశ్వరం మండల కేంద్రం లో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి పర్యటన సందర్భంగా కొందరు కాంగ్రెస్ అల్లరి మూకలు ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తూ సబితా ఇంద్రా రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, తిప్పి కొట్టిన సబితమ్మ సైనికులు, తోక ముడిచి దొడ్డి దారిన పరారవడం జరిగినది. కాంగ్రెస్ ప్రభుత్వము పాలన చేయటము చేతకాక అడ్డుకోవటాలు, అక్రమ కేసులు లాంటి చిల్లర కార్యక్రమాలకు పూనుకుంటుంది. 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కాంగ్రెస్కు భవిష్యత్తులో ప్రజా క్షేత్రంలో ఉరికంభం ఎక్కక తప్పదు…కాంగ్రెస్ నాయకుల్లారా మరొక్కసారి చెబుతున్నాం సబితమ్మ బలం బలగం కార్యకర్తలే ఇది గుర్తుపెట్టుకోండి,.. సబితమ్మ సైనికుల ధాటికి కాలగర్భంలో కలిసిపోతారు అని బీఆర్‌ఎస్ కార్యకర్తలు హెచ్చరించారు.

Share
Share