యాదాద్రి, ఏపీబీ న్యూస్: యాదగిరి గుట్ట టెంపుల్ ఈఓ ఐ వెంకటరావు రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈఓ పోస్ట్ కు రాజీనామా చేసినట్టు చెప్పారు. ఐఏఎస్ గా రిటైర్మెంట్ అయ్యాక టెంపుల్ ఈఓ గా ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈఓ గా పనిచేసిన, కొద్ది రోజుల క్రితం యాదాద్రి అధ్యయన వేడుకలు సందర్భంగా సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నీ స్వయంగా కలసి ఆహ్వానించారు. ఇదే క్రమం లో తన ఆరోగ్య కారణాల దృష్ట్యా తనను ఈఓ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెల్సింది. ఈ నేపథ్యం లో ప్రభుత్వం నిన్న రిలీవ్ ఆర్డర్ జారీ చేసిందని ఆ మేరకు ఆయన గురువారం విధుల నుంచి తప్పుకున్నారు.
