ఖబర్దార్ బండి సంజయ్…గద్దర్ గారిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి: బోయలపల్లి రేఖ

ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు – బోయలపల్లి రేఖ. కేంద్రమంత్రి బండి సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. గద్దర్ చేసిన ప్రజా పోరాటాలు తెలియక మాట్లాడుతున్నారు. 70 సంవత్సరాలుగా ప్రజల కోసం గద్దర్ గొంతు ఆడింది, పాడింది. రజాకార్ల పాలన మీద యుద్ధం చేసింది గద్దర్ గారు. పాటలు, సాహిత్యం ద్వారా ప్రజల్ని చైతన్యపరిచిన ఉద్యమ దీపిక గద్దర్ గారు. దొరల పాలనకు దడ పుట్టించిన వీరుడు గద్దర్ గారు.1969 పుట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అని పాటతో ఉద్యమానికి ఊపిరి పోశారు గద్దర్ గారు.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ప్రాణాలు కోల్పోతుంటే చూసి చలించి ముందుండి ఉద్యమాన్ని నడిపిన యుద్ధ నౌక గద్దర్. పల్లె పట్టణ ప్రజలను చైతన్యం చేస్తూ చివరి వరకు ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక విప్లవాగ్ని గద్దర్. గద్దర్ గురించి కనీస అవగాహనా లేని బండి సంజయ్ ఇకనైనా గద్దర్ పై చేసిన వ్యాఖ్యలని ఉపసంహారించుకోవాలని రేఖ బోయలపల్లి డిమాండ్ చేశారు.

Share
Share