సూర్యాపేట(APB News): అర్వపల్లి లో 365 హైవేపై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ విషయమై ఈరోజు ఉదయము రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి ఇక్కడ ప్రజలకు జరిగే నష్టాన్ని ఈ ప్రాంత వాసిగా ఈ మండల బిడ్డగా వివరించగా మంత్రి వెంటనే స్పందించి నేషనల్ హైవేస్ మంత్రి గడ్కరి గారితో మాట్లాడారు. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని విరమించుకొని అర్వపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని మంత్రి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఫ్లైఓవర్ లేకుండా చూస్తానని, అర్వపల్లి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన మంత్రి వెంకట్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకురాలు,రేఖ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ రేఖ బోయినపల్లి.
