నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు గురువారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ఆఫీసు నుండి కార్పోరేషన్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని అనేక వార్డుల్లో తీవ్ర సమస్యలు ఉన్నాయని, అవన్నీ వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ చర్లపల్లిలో హిందూ శ్మశానవాటికను వెంటనే పూర్తి చేయాలని, ప్రతి వార్డులో నిరంతరం నీటి సరఫరా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జ్ ఉదయ్ ప్రతాప్, సీనియర్లు గోలి మధుసూదన్ రెడ్డి, మాదగాని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్, శ్రీదేవి రెడ్డి, టూ టౌన్ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం పాల్గొన్నారు.