- పార్టీ హైకమాండ్‌కు చేరిన త్రిసభ్య కమిటీ రిపోర్ట్
- మరోవైపు కార్పోరేటర్ పోటీ కోసం రామరాజు ఆప్లికేషన్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: బీజేపీ సీనియర్ నేత పిల్లి రామరాజు యాదవ్ పైన వేటుకు పార్టీ హైకమాండ్ రంగం సిద్ధం చేస్తోందని తెలిసింది. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రామరాజు మధ్య జరిగిన గొడవ గురించి విచారించేందుకు పార్టీ హైకమాండ్ నియమించిన త్రిసభ్య కమిటీ రామారాజు పైన చర్యలు తీసుకోవాల్సిందేనని సిఫార్సు చేసినట్టు తెలిసింది. గొడవకు దారితీసిన పరిస్థితులు, దానికి సంబంధించిన వీడియోలను పరిశీలించిన కమిటీ రామరాజు పైన చర్యలు తీసుకోవాల్సిందేనని హైకమాండ్‌కు రిపోర్ట్ సమర్పించింది.
మరోవైపు నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో రామరాజు భార్య సత్యవతి, అతని తమ్ముడు కృష్ణం రాజు 8, 10 వార్డులో నిలబడేందుకు బుధవారం ఆప్లికేషన్ పెట్టుకున్నట్టు తెలిసింది. 10 వార్డులో జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి తమ్ముడు హర్షిత్ రెడ్డిని నిలబెడతారనే ప్రచారం జరుగుతోంది. రామరాజు పార్టీలో చేరినప్పటి నుంచి వ్యతిరేకత కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆపార్టీ నాయకులు చెపుతున్నారు. గతంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి మిర్యాలగూడలో జరిగిన బీసీ సభలో రామరాజు పాల్గొనడమేగాక, అనుచిత వ్యాఖ్యలు చేశారని, అప్పుడే యాక్షన్ తీసుకోవాల్సి ఉండేదని చెపుతున్నారు.