సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు కొడుకు నలమోతు సిద్ధార్థ
మున్సిపాలిటీ కోసం ఆస్తులు అమ్మేందుకు రెఢీ
సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం హైదరాబాద్ కేంద్రంగా భారీ స్థాయిలో వేలం పాట జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల హడావిడి ఇంకా మొదలు కాకముందే అప్పుడే మిర్యాలగూడ మున్సిపల్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు కొడుకు సిద్ధార్థ చేసిన సంచలన వ్యాఖ్యలు బుధవారం సోషల్ మీడియా గ్రూపుల్లో ఫుల్‌గా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం భాస్కర్ రావు విదేశీ పర్యటనలో ఉన్నారు. గూడెంలో బీఆర్ఎస్ రాజకీయాలను సిద్ధార్థ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ సిద్ధార్థ పూర్తిగా ఇన్వాల్ అయ్యారు. దాంతో నియోజకవర్గంలో, మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
మిర్యాలగూడ రూరల్, దామచర్ల, వేములపల్లి మండలాల్లో బీఆర్ఎస్ సర్పంచ్‌లు గెలుపొందగా, స్వల్ప ఓట్ల తేడాతో చాలా మంది ఓడిపోయారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ సత్తా చూపించేందుకు సిద్ధార్థ స్వయంగా రంగంలోకి దిగారు. గత కొద్దిరోజులుగా పార్టీ శ్రేణులతో మమేకవుతున్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఓట్లు గల్లంతు కావడం పైన పార్టీ శ్రేణులతో చర్చించడంతో పాటు, ఎన్నికల కార్యచరణ గురించి చర్చించారు. ఈ క్రమంలో బుధవారం సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు బుధవారం సిద్ధార్థ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అభివృద్ధి ఘనత మాది..పదవులు అముకునే చరిత్ర కాంగ్రెస్‌ది
గత పదేళ్లలో తన తండ్రి భాస్కర్‌రావు వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండని, దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చి రాష్ట్రంలో మిర్యాలగూడెంకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారాని, అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. కానీ ప్రజా పాలనలో ఆరు నెలల క్రితం యూరియా పక్కదారి పట్టించడంతో మిర్యాలగూడ పేరు రాష్ట్రస్థాయిలో మార్మోగిందని పరోక్షంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
త్వరలో జరిగే మున్సిపల్ చైర్మన్ పదవికి, కౌన్సిలర్ పదవులకు హైదరాబాద్ కేంద్రంగా భేరసారాలు నడుస్తున్నాయని సిద్ధార్థ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైర్మన్ సీటుకు రూ.7 నుంచి రూ.15 కోట్ల వరకు వేలం పాట పెట్టారని, దీని గురించి హైదరాబాద్‌లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. కౌన్సిలర్ టికెట్లకు కూడా టేబుల్ మీద డబ్బులు పెట్టినోళ్లకే ఇస్తామని చెపుతున్నారని అన్నారు.
మున్సిపాలిటీ కోసం ఆస్తులు అమ్ముతం..
బీఆర్ఎస్ పార్టీలో ఆ దౌర్భాగ్యం లేదని, మా కుటుంబానికి ఉన్న ఆస్తులు అమ్మి అయినా సరే కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న కార్య కర్తలను చైర్మన్ గా, కౌన్సిలర్ గా గెలిపించుకునే బాధ్యత తన తండ్రి భాస్కర్‌రావు తీసుకుంటారని, తమ పార్టీలో పదవులకు వేలం లేదని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది ఏదో జరుగుతుందని భ్రమలతో కాంగ్రెస్ పార్టీలో చేరారని, వాళ్లకు అక్కడున్న పరిస్థితులు అవగతమయ్యాయని, తిరిగి మా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తే స్వాగతిస్తామని సిద్ధార్థ స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీని విడిచి వెళ్లిన వాళ్ళు తిరిగి బీఆర్ఎస్లో చేరుతామంటే స్వాగతిస్తామని, కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫర్ ప్రకటించారు.
Big Breaking: మున్సిపల్ చైర్మన్ సీటుకు వేలం! రూ.15 కోట్లు ఇస్తే…

మున్సిపల్ పదవులకు అప్పుడే వేలం..