- షోకాజ్ నోటీసులు కాదు..ఏకంగా సస్పెండ్ చేస్తాం
- సమావేశాలతోనే సరిపెడుతున్న ఆశాలు
భువనగిరి, ఏపీబీ న్యూస్: పల్లె దవాఖానాల్లో డాక్టర్లు ఉండట్లేదని, ఇప్పటికే కొంతమంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, పని తీరులో మార్పు రాకుంటే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్ల రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని దవాఖాన లో లేబర్ రూమ్ లు కేవలం నామమాత్రం గానే ఉన్నాయని, అలా ఉండటానికి వీల్లేదని, ప్రతి దవాఖానలో నార్మల్ డెలివరీలు చేయాలని, ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి మంగళవారం ఆశ డే అని సమావేశాలు మాత్రమే పెడుతున్నారు తప్పా క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదని, గ్రామాల నుండి గర్భిణిని స్త్రీ లు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారంటే ఆశాలు సరిగా పని చేయడం లేదని అర్థం అని అన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పల్లె దవాఖానల్లో పేషెంట్లు తక్కువగా వస్తున్నారని, ఖాళీగా ఉన్న సమయంలో ప్రతి గర్భిణి స్త్రీ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరగాలని, ప్రైవేట్ ఆసుపత్రికి పంపడానికి వీలు లేదన్నారు.