Breaking News: మున్సిపాలిటీ లో బీసీలకు అగ్రస్థానం.. వైస్​ చైర్మన్​లుగా మైనార్టీలు, వైశ్యులు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకే పెద్దపీట వేసింది. 18 మున్సిపల్ కార్పోరేషన్లలో బీసీ చైర్మన్లుగా 9 మంది ఎన్నికయ్యారు. రెడ్లు నలుగురు, ఆర్యవైశ్యులు ఇద్దరు కాగా, కమ్మ సామాజికవర్గం నుంచి ఒకరు చైర్మన్గా ఎన్నికయ్యారు. రిజర్వేషన్ల ప్రకారం బీసీ లకు దేవరకొండ, హుజూర్నగర్, ఆలేరు మున్సిపాలిటీలు మాత్రమే దక్కాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీకు కట్టుబడి ఉమ్మడి జిల్లాలో జనరల్, జనరల్ మహిళలకు రిజర్వు చేసిన చైర్మన్ స్థానాల్లో సైతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. మిర్యాలగూడ, భువనగిరి లాంటి మున్సిపాలిటీల్లో రెడ్లు, వైశ్యులు చైర్మన్ పదవి కోసం పోటీ పడినప్పటికీ అక్కడి ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి బీసీలకే ప్రయార్టీ ఇచ్చారు. మిగితా చోట్ల కూడా ఎమ్మెల్యేలు బీసీల వైపే మొగ్గు చూపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు, చౌటుప్పుల్ మున్సిపాలిటీలను బీసీలకే కట్టబెట్టి రికార్డు సృష్టించారు.

చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించారు. వైస్ చైర్మన్ పదవుల్లో రెడ్డి, వైశ్యులతోపాటు, బీసీల కూడా అగ్రస్థానం కల్పించారు. అయితే ఈ దఫా పద్మశాలీలకు జిల్లాలో ప్రయార్టీ లభించింది. చండూరు, పోచంపల్లి, దేవరకొండ, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్లుగా పద్మశాలి సామాజిక వర్గానికే ఇచ్చారు.

జనరల్ కేటగిరీలో చైర్మన్ స్థానాలు ఆరు రిజర్వు కాగా, రెడ్లకు నేరేడుచర్ల, వైస్ చైర్మన్ (రెడ్డి), తిరుమలగిరి (రెడ్డి), వైస్ చైర్మన్ (బీసీ) హాలియా చైర్మన్ (రెడ్డి), వైస్ చైర్మన్ (యాదవ), సూర్యాపేట చైర్మన్ ఆర్యవైశ్య, వైస్ చైర్మన్ (ముస్లిం)లకు ప్రాతినిధ్యం కల్పించారు. బీసీలకు చండూరు (పద్మశాలి) వైస్ చైర్మన్ (రజక), పోచంపల్లి చైర్మన్ (పద్మశాలి), వైస్ చైర్మన్ (గౌడ)లకు ప్రయార్టీ ఇచ్చారు.

జనరల్ మహిళలకు రిజర్వు చేసిన ఏడు మున్సిపాలిటీల్లో చైర్మన్ లుగా నల్లగొండ మేయర్ రెడ్లకు, డిప్యూటీ మేయర్ (ముస్లిం),  కోదాడ మున్సిపల్ చైర్మన్ కమ్మ, వైస్ చైర్మన్ రెడ్డి, చిట్యాల ఆర్యవైశ్యు, వైస్ చైర్మన్ (యాదవ), బీసీ మహిళలకు మిర్యాలగూడ (పద్మశాలి), వైస్ చైర్మన్ (ఆర్యవైశ్య), చౌటుప్పుల్ (గౌడ), వైస్ చైర్మ న్ (పద్శశాలి), భువనగిరి చైర్మన్ (విశ్వబ్రహ్మణ), వైస్ చైర్మన్ (మున్నూరుకాపు), యాదగిరిగుట్ట చైర్మన్ (గౌడ), వైస్ చైర్మన్ (ముదిరాజ్) ప్రాతినిధ్యం కల్పించారు.

బీసీ జనరల్, బీసీ మహిళలకు రిజర్వు చేసిన మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా దేవరకొండ (పద్మశాలి), వైస్ చైర్మన్ (మైనార్టీ), హుజూర్నగర్ (గౌడ), వైస్ చైర్మన్ (పూసల), ఆలేరు (యాదవ), వైస్ చైర్మన్ (ఎరుకుల). 

ఎస్సీ జనరల్కు కేటాయించిన మున్సిపాలిటీల్లో మాల సామాజిక వర్గానికి నందికొండ చైర్మన్, వైస్ చైర్మన్ కమ్మ, మాదిగ సామాజిక వర్గానికి మోత్కూరు చైర్మన్, వైస్ చైర్మన్ ఆర్యవైశ్యులకు ప్రాతి నిధ్యం కల్పించారు.  

Sl.No.మున్సిపాలిటీచైర్మన్ / మేయర్వైస్ చైర్మన్
1నల్లగొండబుర్రి చైతన్య (మేయర్)అష్రఫ్ అలీ
2దేవరకొండపున్నా శైలజజువేరియా తబుసుమ్
3హుజూర్నగర్దొంతగాని శ్రీనివాస్ గౌడ్మల్లికార్జున రావు
4ఆలేరుబీజన బాలమణిఅంగడి అంజనేయులు
5చండూరుకోడి శ్రీనివాసులుభూతరాజు దశరథ
6హాలియాచింతల రామచంద్రారెడ్డిరాజా రమేష్
7పోచంపల్లితడక వెంకటేశ్వర్లుకొయ్యడ రజిని గౌడ్
8నేరేడుచర్లకొనతం చిన వెంకటరెడ్డినూకల సందీప్ రెడ్డి
9తిరుమలగిరిసంకెపల్లి రఘునందన్ రెడ్డిగోవిందమ్మ
10సూర్యాపేటమొరిశెట్టి నివేధితషఫీ ఉల్లా
11మిర్యాలగూడచిలుకూరు సుధాగుడిపాటి శిరీష
12చిట్యాలపందిరి గీతా రమేశ్జి. శ్రీలక్ష్మి
13చౌటుప్పల్మొగుడాల పావని గౌడ్గోషిక వినయ్
14భువనగిరితంగెళ్లపల్లి శ్రీవాణిపోతంశెట్టి మంజుల
15యాదగిరిగుట్టగుండ్లపల్లి వాణి భరత్గౌడ్ బరిగే రమ్య
16కోదాడఎర్నేని కుసుమదేవరం మల్లీశ్వరి
17నందికొండబడుగు మానస స్వర్ణగొడవర్తి రాజా ప్రసాద్
18మోత్కూర్గడ్డం స్వప్నపల్లెల వెంకన్న
Share
Share