Breaking News: మిర్యాలగూడెంలో డైవర్షన్​ పాలిటిక్స్​… సీఎం రేవంత్​ పర్యటన తర్వాత పడిపోయిన గ్రాఫ్

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ రన్ చేస్తోంది. సొంత పార్టీలో గొడవలను చక్కదిద్దుకోలేక, మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు పైన నిందలు వేయడాన్ని పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. సీఎం రేవంత్ పర్యటన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పడిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంలో చాంతాడంతా జాబితాను ఎమ్మెల్యే వినిపించినప్పటికీ సీఎం నోటి నుంచి ఒక్క హామీ కూడా లభించకపోవడంతో కాంగ్రెస్ లో మరింత అసంతృప్తి వ్యక్తమైంది. మిర్యాలగూడ ను జిల్లాను చేయాలనే ఎమ్మెల్యే కోరినప్పటికీ కనీసం ఒక్కమాట కూడా దానికి గురించి నోరుత్తలేదు. అదే బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ మిర్యాలగూడకు వచ్చినప్పుడు భాస్కర్ రావు మిర్యాలగూడ జిల్లా గురించి ప్రస్తావించగా, కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం మిర్యాలగూడ జిల్లా ప్రస్తావన మరుగున పడిపోయింది. అయితే గత రెండేళ్లలో మిర్యాలగూడ మున్సిపాలిటీ లో ఎమ్మెల్యే చెప్పోదగ్గ పనులేమీ చేయకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. దీన్ని నుంచి ఏదోవిధంగా గట్టెక్కేందుకు సీఎం వేధిక పైన ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టాయి. ఎన్నికల కోడ్ సాకుతో సీఎం దాటవేశారు.

సీఎం రేవంత్ మాజీ ఎమ్మెల్యేను నక్కజిత్తుల భాస్కర్ రావు అని చేసిన అనుచిత వ్యాఖ్యల పైన ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులను చక్కబెట్టుకోవడం చేతగాక మాజీ ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడుతున్నాడని కామెంట్లు చేయడం సరికాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీట్ల పంపకాల్లో తేడాలు వచ్చి బీఫాంలు కూడా నామినేషన్ సెంటర్లో చింపి పడేయడం వంటి సంఘటనలను మరుగున పడేసేందుకు ఉద్దేశపూర్వకంగా మాజీ ఎమ్మెల్యేను ఇరికిరించారని విమర్శలు వస్తున్నాయి.

ఏపీబీ తాజా సర్వే ప్రకారం మిర్యాలగూడలో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగింది. దాదాపు 30 వార్డులో గెలుపు దిశగా బీఆర్ఎస్ పయనిస్తోంది. కాంగ్రెస్ 20 వార్డుల వద్దే ఆగిపోయింది. మొత్తం లక్షకు పైగా శాంపిల్స్ సేకరించగా, బీఆర్ఎస్ కు 41.48 శాతం మంది ప్రజలు మద్ధతు తెలిపారు. కాంగ్రెస్కు 29.49, బీజేపీ 13.6, సీపీఎం 8.68, ఇతరులు 6.69 శాతం మంది తమ అభిప్రాయాని వెలిబుచ్చారు. విచిత్రమేమంటే గత రెండు సర్వేల్లో సీపీఎం గురించి ప్రస్తావించలేదు, కానీ మూడో విడత సర్వేలో సీపీఎంకు 8.68 శాతం మంది జనాలు మద్ధతు తెలిపారు. ఈ ఎన్నికల్లో సీపీఎం, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తోంది. పట్టణంలో పలు వార్డుల్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన సీపీఎం పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులు కలిసి ప్రచారం చేయడం తో ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది.

పార్టీ పేరుఓట్ల పర్సంటేజ్
బీఆర్ఎస్41.48%
బీజేపీ13.66%
కాంగ్రెస్29.49%
సీపీఎం8.68%
ఇతరులు6.69%
Share
Share