- 14 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ వన్‌సైడ్
- నల్లగొండ కార్పోరేషన్తో సహా, మరో మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
- బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే
- కొన్ని చోట్ల ఒక్క ఓటుకు రూ.10 వేల నుంచి రూ.25వేలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 14 మున్సిపాలిటీల్లో మెజార్టీ వార్డులు గెలుచుకోనుంది. నల్గొండ కార్పోరేషన్తో సహా, మరో మూడు మున్సిపాలిటీల్లో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ జరిగింది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ కార్పోరేషన్ 45 స్థానాలు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ 30 నుంచి 35 వరకు గెలుస్తామని పోలింగ్ తర్వాత అంచనాకు వచ్చారు. బీఆర్ఎస్ 13 వార్డుల్లో గెలుస్తుదని, బీజేపీ 3 లేదా 5 వార్డుల్లో, సీపీఎం రెండు వార్డుల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గాలైన కోదాడలో కాంగ్రెస్ 22 నుంచి 25 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 5 లేదా 6 వార్డులు, స్వ తంత్ర అభ్యర్థులు మరో మూడు వార్డుల్లో ప్రభావితం చూపనున్నారు. హుజూర్నగర్లో మాత్రం కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 3, సీపీఐ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డుల్లో గెలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే మున్సిపాలిటీలు
హాలియా, నందికొండ, దేవరకొండ, నేరేడుచర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మెజార్టీ వార్డులు కైవసం చేసుకోనుంది. ఈ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. బలమైన అభ్యర్థులు ఉన్న పలు వార్డుల్లో మాత్రం ఎన్నికల ఖర్చుకు ఏమాత్రం వెనకడాలేదు. ఒక్క ఓటుకు 25 వేలకు పంపిణీ చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ జరిగింది. పోలింగ్ ముగిశాక పరిస్థితిని అంచనా వేసిన రాజకీయ పార్టీలు గెలుస్తామని భావించిన వార్డుల్లో సైతం ఎన్నికల ఫలితాలు తారు మారయ్యే అవకాశం కనిపిస్తోంది.
మిర్యాలగూడలో పల్నాడు ఓటర్లు రిగ్గింగ్..దాంతోనే 27 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు
- తారుమారైన బీఆర్ఎస్ అంచనాలు
- 20 వార్డుల్లో గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
- రీపోలింగ్ జరిపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డిమాండ్
మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో పల్నాడు ఓటర్లు రిగ్గింగ్ పాల్పడిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఆరోపించారు. కాంగ్రెస్ అంచనా మేరకు ఇక్కడ 27కు పైగా వార్డుల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలవరం పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని, 30 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ సర్వే రిపోర్ట్లు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్గం పల్నాడు నుంచి దొంగ ఓటర్లను రంగంలోకి దింపినట్టు తెలిసింది. 48 వార్డుల్లో ప్రతి వార్డులో 100 నుంచి 200 ఓట్లు రిగ్గింగ్ చేసినట్టు తెలిసింది. దాంతోనే బీఆర్ఎస్ అంచనాలు తారు మారుకాగా, 20 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. రిగ్గింగ్ జరిగిన వార్డులో మళ్లీ రీపోలింగ్ జరపాలని మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ వైస్ గా ఏపీబీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
| మున్సిపాలిటీ పేరు | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ / ఇతరులు |
| నల్లగొండ | 30 | 13 | 3–5 |
| హాలియా | 9 | 2–3 | — |
| నందికొండ | 10 | 2–3 | — |
| మిర్యాలగూడ | 27 | 20 | — |
| చండూరు | 6 | 4 | — |
| దేవరకొండ | 10–13 | 5 | 2 |
| చిట్యాల | 6–8 | 4–6 | — |
| సూర్యాపేట | 24–30 | 14–18 | 1–2 |
| కోదాడ | 22–25 | 5–6 | — |
| హుజూర్నగర్ | 19 | 3 | సీపీఐ – 2 |
| నేరేడుచర్ల | 11 | 4 | — |
| తిరుమలగిరి | 7–8 | 5–6 | బీజేపీ – 1 |
| భువనగిరి | 20 | 6–7 | 5–6 |
| ఆలేరు | 7 | 4 | 1 |
| యాదగిరిగుట్ట | 6–7 | 2 | 1 |
| పోచంపల్లి | 9 | 4 | — |
| చౌటుప్పల్ | 8–10 | 7 | 3 |