- నమ్మిన బంటుకు మంత్రి కోమటిరెడ్డి పదోన్నతి
- 42 ఏళ్లకే వరించిన డిప్యూటీ మేయర్ పదవి
- స్లమ్ ఏరియా నుంచి కార్పోరేట్ స్థాయికి ఎదిగిన అష్రఫ్ అలీ
- అన్ని వర్గాల ఆదరణతోనే హ్యాట్రిక్ విజయం
- ఒకే ఇంటి నుంచి తల్లి, భార్య, కొడుకుల రాజకీయ ప్రస్థానం
- ఢిల్లీలో పుట్టిన రూబీకి భాష రాకున్నా పట్టం కట్టిన ప్రజలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన అష్రఫ్ అలీ (ఆమీర్)కి అరుదైన గౌరవం దక్కింది. 42 ఏళ్లకే నల్లగొండ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ పదవి వరించింది. గత 15 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న ఆమీర్ విధేయతకు మంత్రి పట్టం కట్టారు. స్లమ్ ఏరియా నుంచి మూడుసార్లు హ్యాట్రిక్ విజయం అందుకున్న ఆమీర్ కుటుంబాన్ని గత 15 ఏళ్ల నుంచి ప్రజలు ఆదరిస్తున్నారు. తల్లి, భార్య, భర్త ఇలా ఒకే కుటుంబం వరుస విజయాలు అందుకుంటోంది. మైనార్టీలను మాత్రమే ఆమీర్ ఆదరిస్తారనే విమర్శలను అక్కడి ప్రజలు తిప్పికొట్టారు. అన్ని మతాలు, కులాల ఆదరణతోనే కౌన్సిలర్గా, కార్పోరేటర్గా విజయం సాధ్యమైందని ఆమీర్ ఏపీబీ ప్రతినిధితో చెప్పారు. గురువారం ఏపీబీ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు.
దుబాయ్ నుంచి యూటర్న్
ఆష్రఫ్ అలీది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం, ఆరుగురు సంతానం ఆమీర్ వాళ్ల నాన్న జాఫర్ అలీ ఆర్టీసీ కండక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అక్కలు, అన్నలు, బావలు, వాళ్ల పిల్లలతో ఆమీర్ కుటుంబం సభ్యులు నల్లగొండ, హైదరాబాద్, సౌదీలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిలయ్యారు. 15 ఏళ్ల క్రితమే దుబాయ్లో సెటిల్ కావాల్సిన ఆమీర్ ఊహించకుండానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పదో తరగతి వరకే చదువుకున్న ఆమీర్ మొబైల్ నెట్వర్క్, ఆటోకాడ్ వంటి వివిధ రకాల ప్రొఫెషనల్ కోర్సులో ట్రైనింగ్ పొందారు, దాంతోనే దుబాయ్లో కనస్ట్రక్షన్ ఫీల్డ్లో కొంత కాలం ఉద్యోగం చేసిన ఆమీర్ నల్లగొండకు రావడంతో లైఫ్ చేంజ్ అయ్యింది. కుటుంబ భారం మీద పడటంతో తిరిగి దుబాయ్ వెళ్లేందుకు సిద్దమయ్యారు, కానీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు తన ప్రయాణాన్నీ విరమించుకుని ఇక్కడే ఉండిపోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఏంఐఎం పార్టీ నుంచి ఆహ్వానం రావడంతో ఆమీర్ వాళ్ల అమ్మ ఆసీఫా సుల్తాన కౌన్సిలర్ గా పోటీ చేశారు. తన తల్లి గెలుపుతో స్లమ్ ఏరియాగా ఉన్న వార్డును అభివృద్ధి చేయాలని సంకల్పించారు.
స్లమ్ ఏరియా బాగుకోసం
మురిక వాడ కూపంగా ఉన్న తన వార్డులో గట్టిగా వరద వస్తే వరద కాలువ పొంగి పొర్లి ప్రవహిస్తుంది. ఇళ్లలోకి నీరు చేరేది, వరద కాల్వ అధ్వాన్నంగా ఉండటంతో ప్రమాదాలు జరిగేవి, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద వల్ల రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో జనాలు, పిల్లలు, ఇతరుల ఇళ్లల నుంచి రాకపోకలు సాగించాల్సి వచ్చేది. అధ్వాన్న పరిస్థితులను చూసి చలించిపోయిన ఆమీర్ నిధుల కోసం అప్పటి బీఆర్ఎస్ నేతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన పట్టించుకోలేదు. వంద కోట్ల నిధులు వచ్చిన ఒక్క పైసా కూడా ఆమీర్వార్డు లో పెట్టలేదు, దీంతో అప్పుడే కొత్తగా వచ్చిన కమిషనర్ రమణాచారి చొరవతో వరద కాల్వ కష్టాలు తీరాయి. అంతటితో ఆగిపోకుండా పేదలకు కార్పోరేషన్ రుణాలు ఇప్పించారు. గంజాయి అరికట్టడం లో కఠినమైన చర్యలు చేపట్టారు. స్లమ్ ఏరియాలో గంజాయి వాడకం వల్ల యువకులు చెడిపోతున్నారని భావించిన ఆమీర్ వాటి ఆ నవాళ్లు లేకుండా చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టారు.
ఆ ప్రమాదంతోనే ఆమీర్ జనంలోకి
కొన్ని ఏళ్ల క్రితం జరిగిన గ్యాస్ సిలండర్ పేలుడు దుర్ఘటనలో చనిపోయిన క్షతగాత్రులను ఆమీర్ ఆదుకున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి బాధితులకు ఆర్ధిక సాయం ఆమీర్ ద్వారా అందజేశారు. ఆమీర్కు స్వయంగా కాల్ చేసి బాధితులను ఆదుకోవాలని చెప్పడం జరిగింది. ఈ సంఘటన నేపథ్యంలో ఆమీర్ చేసిన కృషి అందరూ అభినందించారు.
కోమటిరెడ్డి ఓడిపోయినా పార్టీ వీడలే
ఏంఐఎంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు తన వార్డు బాగుకోసం నిధులు ఇవ్వలేదని కాంగ్రెస్లో చేరిండు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు పార్టీలో చేరిన ఆమీర్ తన భార్య రూబీని కౌన్సిలర్గా నిలబెట్టారు. ఢిల్లీకి చెందిన రూబీకి తెలుగు రాకపోయినప్పటికీ అక్కడి ప్రజలు ఆమెను ఆదరించారు, కానీ వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఆమీర్ను తీవ్రంగా కలిచివేసింది. అప్పుడు చాలా మంది పార్టీ మారినప్పటికీ ఆమీర్ మాత్రం కోమటిరెడ్డి వెంటే ఉన్నడు.
కోమటిరెడ్డి బ్రదర్స్తో విడదీయలేని బంధం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్తో ఆమీర్ వాళ్ల నాన్నకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. వెంకటరెడ్డి అన్న మోహన్ రెడ్డితో సహా, వాళ్ల సోదరులతో ఆమీర్ నాన్నకు ఉన్న స్నేహం రాజకీయంగా కలిసొచ్చింది. మూడోసారి అడకుండానే మంత్రి కోమటిరెడ్డి ఆమీర్కు టికెట్ అనౌన్స్ చేశారు, దాంతో ఆమీర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడం భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మైనార్టీ కౌన్సిలర్లలో మూడో సారి గెలిచిన ఆమీర్ సీనియర్.
అడగకుండానే డిప్యూటీ మేయర్ పదవి
డెప్యూటీ మేయర్ పదవి వస్తదని ఆమీర్ అస్సలు ఊహించలేదు. తన పేరు పరిశీలనలో ఉందనే సంగతి కూడా తెల్వదు. మైనార్టీలకే డిప్యూటీ మేయర్ ఇవ్వాలని మంత్రి నిర్ణయించినప్పటికీ ఆ జాబితా లో ఆమీర్ ఉంటడని ఊహించలేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లలో ముగ్గురి పేర్లు పరిశీలించినప్పటికీ ముందు వరుసలో ఆమీర్ పేరే ఉంది. రెండు రోజుల పాటు క్యాంపులో ఉన్నప్పటికీ ఆమీర్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. క్యాంపు నుంచి నల్లగొండకు చేరుకునే మార్గమాధ్యలో తన పేరు ఉందని సంగతి తోటి కౌన్సిలర్లు చెబితే తప్పా తెలియదు. గెలిచిన మైనార్టీ కౌన్సిలర్లలో పురుషుల్లో సీనియర్ ఆమీర్ ఉండటం ఒక ఎతైతే, మంత్రి కోమటిరెడ్డికి నమ్మిన బంటుగా ఉండటం కలిసొచ్చింది.

ప్రకాశం బజార్తోనే అభివృద్ధి షురూ
మంత్రి కోమటిరెడ్డి ఆశీస్సులతో నా డివిజన్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమీర్ అన్నారు. పెండింగ్లో ఉన్న వరద కాలువ పనులు పూర్తి చేయాల్సి ఉందని, నిరుద్యోగులకు రుణాలు ఇప్పించాలని, తాగునీరు, మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ఆమీర్ చెప్పారు. ప్రకాశం బజార్లో డివైడర్ల తొలగింపు గొప్ప కార్యక్రమం అని, చిరు వ్యాపారులకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సహకారంతో నా డివిజన్ అభివృద్ధి ప్రకాశం బజార్తోనే మొదలైందని ఆమీర్ చెప్పారు.