Breaking News: ఏపీబీ వరుస కథనాలతో ఎండీ కృష్ణ రాజీనామా.. మళ్లీ చైర్మన్​గా మధుసూధన్​ రెడ్డి బాధ్యతలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి. చైర్మన్ పదవి వద్దని రాజీనామా చేసిన గుడిపాటి మధుసూధన్ రెడ్డి మళ్లీ చైర్మన్గా రావడం, ఎండీ కృష్ణ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవడం చూస్తే అసలు డెయిరీలో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అంతుచిక్కడం లేదు. చైర్మన్ పదవి వద్దని రాజీనామా చేసిన మధుసూధన్ రెడ్డి ఎండీ కృష్ణ పైనా, పాలకవర్గం డైరక్టర్ల పైన నిప్పులు చెరిగారు. చైర్మన్గా తన అధికారాన్ని సైతం లెక్కచేయండా ఎండీ కృష్ణ, డైరక్టర్లు కుమ్మకై బ్యాంకులను తప్పుతోవ పట్టించారని, ఉద్యోగులను, రైతులను మోసం చేస్తున్నారని, వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని మీడియా ఎదుట వివరించారు. భువనగిరిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి 15రోజులు కూడా గడవకముందే మళ్లీ ఆయన్నే చైర్మన్గా డైరక్టర్లు ఎన్నుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక పోతే ఎండీ కృష్ణ అంతులేని అక్రమాలకే డెయిరీని దివాళ తీయించాయని ఆరోపించిన మధుసూధన్ రెడ్డి ఎండీ తప్పుకుంటేనే చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటానని కండీషన్ పెట్టాడని, దాంతోనే ఎండీ పోస్టుకు రాజీనామా చేసిండని డెయిరీ వర్గాలు తెలిపాయి.

ఇకపోతే ఎన్డీడీబీతో జరిగిన ఒప్పందాన్ని సైతం ఎండీ అడ్డుకుంటున్నాడని, దానికి డైరక్టర్లు వత్తాసు పలుకుతున్నారని చెప్పిన మధుసూధన్ రెడ్డి రాకతో మళ్లీ ఎన్డీడీబీ ఒప్పందం తెరపైకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు ఎన్డీడీబీ వద్దని అడ్డుకున్న డైరక్టర్లు మళ్లీ ఎందుకు ఒప్పుకున్నారో కూడా అంతుచిక్కడం లేదు. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని ఒప్పించలేని పాలవకర్గం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే కలుస్తామని, నిధుల వర్షం కురిపిస్తామని మధుసూధన్ రెడ్డి ఇచ్చిన హామీ ఎంత వరకు నెరవేరుతుందో వేచిచూడాల్సిందే.

apb news clips on narmul dairy

ఏపీబీ పబ్లిష్ చేసిన వరుస కథనాలతో డెయిరీ వర్గాలు, డైరక్టర్లు బెంబేలెత్తిపోయారు. ఎండీ కృష్ణ స్వయంగా ఫోన్ చేసి పాలకవర్గం సపోర్ట్తోనే పనిచేస్తున్నాని వాళ్లకు తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు ఉందని ఏపీబీ ప్రతినిధికి చెప్పారు. ఏపీబీకి ఫోన్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడం గమనార్హం. ఈనెల 24న పాలకవర్గం రద్ధు దిశగా మధర్ డెయిరీ, 26న మధర్ డెయిరీలో డైరక్టర్ల ఇష్టారాజ్యం అనే కథనాలు ప్రచురించింది. మధుసూధన్ రెడ్డి భువనగిరిలో పెట్టిన మీడియా సమావేశాన్ని సైతం సవివరంగా ప్రచురించింది. మరోవైపు మాజీ చైర్మన్ జితేందర్ రెడ్డి డెయిరీలోకి ప్రవేశించేందుకు కుట్ర పనుతున్నారని, సొసైటీ అధ్యక్షులను ఏకం చేసి తిరుగుబాటుకు ప్లాన్ చేస్తుండటం డైరకర్టను ఆందోళనకు గురిచేసింది. ఫిబ్రవరి 2న జరగాల్సిన బోర్డు మీటింగ్కు ముందే మళ్లీ మధుసూధన్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడం చూస్తే జితేందర్ రెడ్డిని రాకుండా చేసేందుకే తెరవెనక కొన్ని రాజకీయ శక్తులు పనిచేశాయని తెలుస్తోంది.

Share
Share