- నేడు పంచాయతీ తొలి పోరు
- ఉమ్మడి జిల్లాల్లో 28 మండలాల పరిధిలో
- 585 సర్పంచ్ స్థానాలకు, 4,776 వార్డులకు ఎన్నికలు
- బరిలో దిగిన సర్పంచ్ అభ్యర్థులు 1836 మంది, వార్డు స్థానాలకు 11,281 మంది అభ్యర్థులు
- ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు పోలింగ్
- మధ్యాహ్నాం తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
నల్లగొండ ప్రతినిధి : ఏపీబీ న్యూస్, డిసెంబర్ 11
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి పోరు నేడు (గురువారం) జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు బుధవారం ఉదయం మొదటి విడత పోలింగ్ జరిగే పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎస్పీలు సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని 28 మండలాల పరిధిలో 585 సర్పంచ్ స్థానాలకు, 4,776 వార్డులకు ఎన్ని కలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు 1836 మంది పోటీ చేస్తుండగా, వార్డు సభ్యులుగా 11,281 మంది అభ్య ర్థులు పోటీలో ఉన్నారు. ఈ విడతలో మొత్తం 8,54,530 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నాం 1 గంటకు ముగుస్తుంది. మధ్యాహ్నాం లంచ్ బ్రేక్ తర్వాత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎన్నికల ఫలితాలు సాయంత్రం వరకు ప్రకటిస్తారు. అ దే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత వాయిదా పడితే మరుసటి రోజు ఉప సర్పంచ్‌ని ఎన్నుకుంటారు.

జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు…
నల్లగొండ జిల్లాలో చిట్యాల, కనగల్, కట్టంగూరు, కేతేపల్లి, నకిరేకల్, నల్గొండ, నార్కెట్ పల్లి, శాలిగౌరారం, తిప్పర్తి, చండూరు, గట్టుప్పల్, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి మండలాల పరిధిలో మొత్తం 318 పంచాయతీలకుగాను 22 ఏకగ్రీవం కాగా, 296 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,870 వార్డలకుగాను 375 ఏక గ్రీవంకాగా 2,495 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ అభ్యర్థులు 966, వార్డు సభ్యులు 5,934 మంది బరిలో ఉన్నారు. మొత్తం 2,870 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 34 గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. 362 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 3,444 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు. మొత్తం 30 టీమ్లు ఏర్పాటు చేశారు. పురుషులు 2,29,134, మహిళలు 2,35,027, ఇతరులు 8 మంది మొత్తం 4,64,169 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరులగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్) మండలల పరిధిలోని 159 పంచాయతీలకు గాను 7 ఏకగ్రీవం కాగా, 152 పంచాయతీలు, వార్డులు 1442లో 198 ఏకగ్రీవం కాగా, 1241 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 473 మంది సర్పంచ్ అభ్య ర్థులు, 2,911 మంది వార్డు సభ్యులు పోటీలో నిలిచారు. మొత్తం ఓటర్లు 2,27,960 మంది కాగా, పురుషులు 1,13,186, మహిళలు 1,47,069, ఇతరులు 5మంది ఉన్నారు. 24 గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. 38 మంది మైక్రో అభ్వర్జర్లను నియమించారు. 1543 బ్యాలెట్ బాక్సులు వినియోగించనుననారు. 1403 పోలింగ్ స్టేష్లన్లు ఏర్పాటు చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), బొమ్మల రామారం, తుర్కపల్లి మండలాల పరిధి లోని 153 గ్రామ పంచాయితీల్లో 16 ఏకగ్రీవం కాగా, 137 జీపీలకు, 1286 వార్డులకుగాను 246 ఏకగ్రీవం కాగా 1040 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 397 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,436 మంది వార్డు సభ్యులు ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 1,62,401 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీంట్లో పురుషులు 78,224, మహిళలు 79,591, ఇతరులు ఇద్దరు ఉ న్నారు. 1177 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. 1441 పో లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
