యాదాద్రి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా సమయపాలనతో పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలం దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్ ను గురువారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన కౌంటర్లు, సామగ్రి పంపిణీ ఏర్పాట్లు, రిసెప్షన్ డెస్కులు, నియంత్రణ గదులు, భద్రతా చర్యలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.