నల్లగొండ, ఏపీబీ న్యూస్: భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలకు, పండుగలకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో జరిగిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ మన జీవన విధానాన్ని, గ్రామీణ సంస్కృతిని, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తదని, ఈ పండుగ సందర్భంగా మహిళలు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు మన సంప్రదాయాలకు అద్దం పడతాయని అన్నారు. ఇలాంటి పోటీలు మహిళల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే వేదికలని, మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని మరింత బలపరుస్తాయన్నారు. మహిళా శక్తి బలపడితే కుటుంబం బలపడుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
