జిల్లాల పునర్విభజన విషయంలో రాజకీయాలు చేయోద్దు: ఎంపీ చామల

జిల్లాల పునర్విభజన విషయంలో రాజకీయాలు చేయోద్దు: ఎంపీ చామల

జనగామ, ఏపీబీ న్యూస్​: జిల్లాల పునర్విభజన విషయంలోరాజకీయాలు చేయోద్దని, ప్రజలను గందరగోళంలోకి నెట్టొద్దని ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి అన్నారు. సోమవారం జనగామ మున్సిపల్​ ఆఫీసులో అభివృద్ధి పనుల పైన రివ్యూ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జనగామ జిల్లా గురించి ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల జనగామ జిల్లాను కాపాడుకోవడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.  మున్సిపాలిటీ అభివృద్ధికై ప్రభుత్వం 18.07 కోట్లు కేటాయించిందని, పార్టీలకు అతీతంగా ప్రజలకు అవసరమైన పనులను మొదటి ప్రాధాన్యతగా చేపట్టాలని అధికారులను కోరారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని, కాంగ్రెస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పనులను పరిశీలించాలని ఎంపీ చామల​ కోరారు.

Share
Share