ట్విట్టర్​ టిల్లు..! నిన్ను సిరిసిల్లలో ఓడించే బాధ్యత నాదే!: బీజేపీ ఎంపీ

దేవరకొండ, ఏపీబీ న్యూస్​: ట్విట్టర్​ టిల్లు కేటీఆర్​..! ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. బీజేపీ పైన మరోసారి అవాకులు చవాకులు పేలితే సిరిసిల్లలో నిన్ను మరోసారి గెలవకుండా చేసే బాధ్యత నేనే తీసుకుంటా అని ఎంపీ రఘునందన్ ​రావు ఫైర్​ అయ్యారు. సోమవారం చింతపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్​కు ఉద్యమాలు చేయడం చేత కాదని, ట్విట్టర్​ టిల్లు చేష్టలు మానుకుని జనంలోకి వచ్చి ఉద్యమాలు చేయాలని ఆయన తోడ బుట్టిన చెల్లే కవిత చెప్పిందని ఎంపీ అన్నారు. హైదరాబాద్​లో ఇంతా, అంతా చేసినం అని చెప్పుకుంటున్న కేటీఆర్​? వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ కంటే బీజేపీ నాలుగు సీట్లు ఎక్కువ గెలిచి చూపిస్తామని చాలెంజ్ చేశారు. టీఆర్​ఎస్​, బీఆర్​ఎస్​గా మారిందని, చివరకు ప్రజలు సీఆర్​ఎస్​ ఇచ్చారని వ్యాఖ్యానించారు. వాస్తవాలు విస్మరించి, గ్రౌండ్​ రిపోర్ట్​కు విరుద్ధంగా కేటీఆర్​ బీజేపీకి బలం లేదని విమర్శించడం అవగాహన రాహిత్యమని అన్నారు. అధికారం కోల్పోయాక, తిరిగి అధికారంలోకి రావడం జరగదనే విశ్వాసం కోల్పోయాక తనకు తాను పైసలు ఉన్నాయనే తన మీడియా సంస్థల చేత తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.

bjp mp raghunandan strong warning to ktr chinthapally

2019లో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సిరిసిల్లలో నీకొచ్చిన మెజార్టీ 80వేలు. ఆరు నెలల తర్వాత కేసీఆర్​ సీఎం అయ్యాక, కేటీఆర్​ మున్సిపల్​ మంత్రి అయ్యాక అదే సిరిసిల్లలో కరీంనగర్​ ఎంపీగా పోటీ చేసిన బండి సంజయ్​కు, మీకు మధ్యన వచ్చినటు వంటి తేడా ఓట్లు 5 వేలు. నీ బావ హారీష్​రావు 2019 ఎన్నికల్లో సిద్ధిపేటలో లక్షా 18 వేల మెజార్టీతో గెలిచినా చెప్పుకుంటడు, తిరిగి 2024లో ఎన్నికల బీజేపీ మీద మీ బావకు వచ్చిన మెజార్టీ 2,300, దీన్ని ఎవరిది గాలి, ఎవరిది బలుపు, వొళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటదని హెచ్చరించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చినయ్, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 12 వేల సర్పంచ్​ల నుంచి 3 వేలకు దిగారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ తెరమరుగు కావడం ఖాయమని చెప్పారు. ఈ రకమైన గ్రౌండ్​ రిపోర్ట్​ ఉంటే మీరేమో మేము ప్రతిపక్షం కాదు, ప్రజల పక్షం అని చెప్పుకుంటున్నరు. కానీ మీది ఫక్తు పైసల పక్షం అహకార పక్షమని, నిజంగా  ప్రజల పక్షం ఉంటే నీకు 80 వేల మెజార్టి వచ్చిన దగ్గర 5 వేల మెజార్టీ ఎందుకు పడిపోతావ్​ ఆలోచించుకో కేటీఆర్​ అని వార్నింగ్​ ఇచ్చారు.

Share
Share