- మున్సిపల్ ఓటర్లు 6,68,545, ఫైనల్ జాబితా ప్రకటించిన కమిషనర్లు
- పురుషులు 3,23,658, మహిళలు 3,44,759, ఇతరులు 129
- మొత్తం 18 మున్సిపాలిటీలు వార్డులు 407
- నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా, 16న ఫైనల్ జాబితా
- బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ఏర్పాటుకు చర్యలు
- ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: సీఎస్ రామకృష్ణారావు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 6,68,545 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో పురుషులు 3,23,658, మహిళలు 3,44,759, ఇతరులు 129 మంది ఉన్నారు. 18 మున్సిపాలిటీల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 21,101 మంది ఎక్కువగా ఉన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 407 వార్డులు ఉన్నాయి. సోమవారం మున్సిపల్ కమిషనర్లు తుది ఓటరు జాబితా ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైనల్ ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలని, 16న తుది జాబితా వెల్లడించాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.
ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేనాటికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి కావాలని, తక్షణమే బ్యాలె ట్ పేపర్లను ముద్రించేందుకు ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించాలని చెప్పారు. కలెక్టర్లు సైతం మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్ల పైన దృష్టి సారించాలని చెప్పారు.
జిల్లాల వారీగా మున్సిపల్ ఓటర్ల వివరాలు
నల్లగొండ జిల్లా:
| మున్సిపాలిటీ | వార్డులు | పురుషులు | మహిళలు | ఇతరులు |
| నల్లగొండ | 48 | 68,874 | 73,507 | 56 |
| మిర్యాలగూడ | 48 | 45,128 | 47,878 | 14 |
| దేవరకొండ | 20 | 11,629 | 12,200 | 1 |
| హాలియా | 12 | 6,270 | 6,529 | 2 |
| నందికొండ | 12 | 6,441 | 7,079 | 1 |
| చండూరు | 10 | 5,652 | 5,717 | 1 |
| చిట్యాల | 12 | 5,930 | 6,188 | 1 |
సూర్యాపేట జిల్లా:
| మున్సిపాలిటీ | వార్డులు | పురుషులు | మహిళలు | ఇతరులు |
| సూర్యాపేట | 48 | 52,170 | 56,664 | 14 |
| కోదాడ | 35 | 28,069 | 30,520 | 12 |
| హుజూర్నగర్ | 28 | 14,257 | 15,731 | 8 |
| నేరేడుచర్ల | 15 | 6,629 | 7,116 | 1 |
| తిరుమలగిరి | 15 | 7,638 | 7,817 | 0 |
యాదాద్రి జిల్లా:
| మున్సిపాలిటీ | వార్డులు | పురుషులు | మహిళలు | ఇతరులు |
| ఆలేరు | 12 | 6,691 | 6,978 | 1 |
| భువనగిరి | 35 | 23,040 | 24,799 | 1 |
| చౌటుప్పుల్ | 20 | 13,553 | 13,663 | 0 |
| మోత్కూరు | 12 | 7,117 | 7,299 | 0 |
| పోచంపల్లి | 13 | 7,808 | 8,031 | 0 |
| యాదగిరిగుట్ట | 12 | 6,762 | 7,043 | 16 |