కవిత నాకు ఫోన్ చేయలేదు.. స్వయంగా చెప్పింది కాబట్టే రాజీనామా ఆమోదం

హైద్రాబాద్, ఏపీబీ న్యూస్: హిల్ట్ పాలసీ అనేది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చేసిందనీ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హైద్రాబాద్ లో మీడియా తో చిట్ చాట్ చేశారు. మూసి పొల్యూషన్ సిటీలోని ఇండస్ట్రెస్ వల్లనే అయ్యిందన్నారు. ఈ ఎఫెక్ట్ నల్గొండ జిల్లాపై పడిందనీ చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్ గా నిర్ణయం తీసుకున్నప్పుడు బాధ్యతగా ఆలోచించుకోమని చెప్పామని అన్నారు. ఆమె ఎప్పుడూ నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పలేదని, ముందు పీఏ తో లేఖ పంపి తర్వాత నాకు కాల్ చేశారని తెలిపారు. కానీ నిన్న కవిత స్వయంగా మండలి లో రాజీనామా ఆమోదించాలని కోరడంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చైర్మెన్ తెలిపారు. రాజకీయ నాయకులు ఎవరైనా కానీ పరుష పదజాలం తో మాట్లాడటం మంచి పద్ధతి కాదని, బావి తరాలకి మంచి భాషని ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉందని అన్నారు. మండలి కొత్త బిల్డింగ్ ఫిబ్రవరి లో పూర్తి అవుతుందని చెప్పారు. నల్గొండ జిల్లా, మంత్రుల పనితీరు బాగుందన్నారు. అందరి అభిప్రాయం మేరకే నల్లగొండ కార్పొరేషన్ చేశారని చైర్మెన్ గుత్తా చెప్పారు.

Share
Share