Interesting News: నీలగిరి తొలి మేయర్​ ఎవరు..? కాంగ్రెస్ ​లో చర్చ

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: నీలగిరి కార్పోరేషన్​కు తొలి మేయర్​ ఎవరు అవుతారనే దాని పైన కాంగ్రెస్​ పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ ఎన్నికల్లో కార్పోరేషన్ కాదనే అభిప్రాయంతో ఉన్న పార్టీ కేడర్​కు మంగళవారం అసెంబ్లీలో ప్రకటన వెలువడటంతో ఒక్కసారిగా నల్లగొండలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్​ మాజీ చైర్మన్​ బుర్రి శ్రీనివాస్​ రెడ్డి, మాజీ జడ్సీటీసీ గుమ్మల మోహన్​ రెడ్డి, మాజీ వైస్​ చైర్మన్​ అబ్బగోని రమేష్ ​గౌడ్​ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. కార్పోరేషన్​లో కాంగ్రెస్​ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. అంతేగాక బీఆర్​ఎస్​ పైన విమర్శలు గుప్పించారు. మొన్నటి వరకు మున్సిపల్​ చైర్మన్​ రిజర్వేషన్​ ఈసారి బీసీ లేదా ఎస్సీలకు అయ్యే అవకాశం ఉంటదని చర్చ జరిగింది. కానీ ఇప్పుడు కార్పోరేషన్​గా మారడంతో అంచనాలు మారిపోతున్నాయి.

రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్​ల తరహాలోనే నల్లగొండ కార్పోరేషన్​ కి కూడా ఎన్నికలు జరుగుతాయని, షెడ్యూల్​లో ఎలాంటి మార్పు ఉండదని ఆఫీసర్లు చెపుతున్నారు. అంతేగాక వార్డుల సంఖ్య కూడా పెరగదని, 48 వార్డులు యధావిధిగా ఉంటాయని, కాకపోతే వార్డుల బదులు డివిజన్​లు అని పిలుస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఓటరు జాబితా ప్రక్రియ యాథతధంగా కొనసాగుతుందని ఆఫీసర్లు చెప్పారు.

మేయర్​ పీఠం పైన ఆశలు…

నల్లగొండ మున్సిపాలిటీ ఇప్పటికే అనేక సార్లు జనరల్​ రిజర్వేషన్​ అయ్యింది. కావున ఈసారి బీసీ లేదా ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉందని భావించారు. కానీ కార్పోరేషన్​గా మారడంతో రొటేషన్​ సిస్టమ్​లో రిజర్వేషన్​లు మారే అవకాశం ఉంటుంది. పైగా తొలిసారి కార్పోరేషన్​ హోదాలో ఎన్నికలు జరుగుతున్న నీలగిరి మేయర్​ పీఠం జనరల్​ రిజర్వు చేస్తారనే టాక్​ వినిపిస్తోంది. ఒకవేళ జనరల్​ అయితే మాత్రం తొలి మేయర్​గా మున్సిపల్​ మాజీ చైర్మన్ బుర్రి శ్రీ నివాస్​ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏడాది కాలం పాటు చైర్మన్​గా పనిచేసిన శ్రీనివాస్​ రెడ్డి మున్సిపాల్టీ పైన పట్టుసాధించారు. ఇప్పటకే అనేక దఫాలుగా కౌన్సిలర్​గా ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో ఆయన సతీమణి చైతన్య కూడా చైర్మన్​గా గెలిచారు. అంతేగాక 20 వార్డుల్లో కాంగ్రెస్​ కౌన్సిలర్లను గెలిపించడంలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పూర్తి సహకారం అందించారు.

burri srinivas reddy

ఒకవేళ బీసీ, ఎస్సీ లకు రిజర్వు చేస్తే కాంగ్రెస్​తో పాటు, బీజేపీ, బీఆర్​ఎస్​ లీడర్లు సైతం గట్టిగానే పోటీ పడే పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి పిల్లిరామరాజు యాదవ్​ ఇప్పటికే భారీ ఫ్లెక్సీలతో పట్టణంలో సందడి చేస్తున్నారు. అన్ని డివిజన్​లో అభ్యర్థులను నిలబెట్టడమేగాక, ఎన్నికల ఖర్చు సైతం వెనక్కి తగ్గొద్దనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది.

Share
Share