కౌన్సిలర్​ టికెట్లు మంత్రి కోమటిరెడ్డి డిసైడ్​ చేస్తరు: మున్సిపల్​ మాజీ చైర్మన్

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ కేటాయింపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం మేరకు జరుగుతాయని, ఇప్పటి వరకు ఎవరికీ హామీ ఇవ్వలేదని మున్సిపల్​ మాజీ చైర్మన్​ బుర్రి శ్రీనివాస్​ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్​ రెడ్డి, మాజీ వైస్​ చైర్మన్​ అబ్బగోని రమేష్​గౌడ్ అన్నారు. ఆదివారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ వార్డు కౌన్సిలర్ల టికెట్ల విషయమై ఇప్పటివరకు ఎవ్వరికీ హామీ ఇవ్వలేదని, ఎన్నికలలో పార్టీ నుంచి టికెట్ ఎవరికి ఇచ్చిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందని చెప్పారు.

municipal ex chairman

నల్గొండ పట్టణంలో 48 వార్డులు ఉండగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించిన తర్వాత గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా ఖరారు చేస్తారని చెప్పారు. ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు అయినట్లు, సీట్లు కేటాయించినట్లు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు పోస్టులు పెడుతూ అయోమయానికి గురి చేస్తున్నారు వీటిని ఎవరు నమ్మొద్దని చెప్పారు.

Share
Share