రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటికి సిద్ధం: IUML

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: కార్పొరేషన్, మున్సిపాలిటీ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడానికి తెలంగాణలో సిద్ధంగా ఉందని ది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ షకిల్ అన్నారు. ఆదివారం నల్గొండలోని రామగిరి లోగల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. తమిళనాడు, కేరళ లో తమ పార్టీ బలంగా ఉందని అన్నారు. తమ పార్టీ గెలిచిన చోట ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందాలని పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని అన్నారు. అవితిలేని సమాజం కోసం తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ షేక్ చాంద్బాషా , కోశాధికారి అహ్మద్ బిలాల్, రాష్ట్ర నాయకులు ఎస్కే జహంగీర్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాజీ బాబా, నల్గొండ జిల్లా జనరల్ సెక్రెటరీ మొహమ్మద్ ఫజల్, పాల్గొన్నారు.

Share
Share