- పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి
- కొత్త సర్పంచ్లకు స్వీట్స్ ప్యాకెట్లు, గ్రీటింగ్ పంపిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నల్లగొండ, ఏపీబీ న్యూస్: కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 968 గ్రామ పంచాయతీల సర్పంచ్లకు స్వీట్ ప్యాకెట్లు, నూతన సంవత్సర గ్రీటింగ్ కార్డులు పంపారు. ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి తండ్రి నాగారం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రా రెడ్డి సైతం స్వీట్బాక్స్ పంపించి, విషెస్ తెలియజేశారు. ప్రజాపాలనలో సర్పంచ్లు భాగస్వామ్యం కావాలని ఎంపీ కిరణ్ ఆకాంక్షించారు.