BJP: తగ్గేదేలే అంటున్న పిల్లి రామరాజు యాదవ్…

  • పిల్లి రామరాజుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రావు పరామర్శ
  • క్లాక్​ టవర్​ సెంటర్​లో బీసీ సంఘాల ధర్నా

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: బీజేపీ సీనియర్​ నేత పిల్లి రామరాజు యాదవ్​ పైన జరిగిన దాడి దృష్ట్యా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు శుక్రవారం ఆయన్ని ఫోన్​లో పరామర్శించారు. ఇలాంటి విషయాలు పట్టించుకోవద్దని, పెద్దగా చేయోద్దని, బీసీ సంఘాల ఆందోళన విరమింపచేయాలని కోరినట్టు తెలిసింది. అయితే అప్పటికే బీసీ సంఘాలు, విద్యార్ధి విభాగం నాయకులు క్లాక్​ టవర్​ సెంటర్​ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గురువారం పార్టీ ఆఫీసులో రామరాజు పైన దాడి చేసిన ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి టుటౌన్ పీఎస్​లో కంప్లైట్​ చేశారు. కేసు సంగతి ఆలస్యంగా బయటకు రావడంతో కోపోద్రుక్తులైన బీసీ సంఘాలు శుక్రవారం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేయాడినికి సిద్ధ మయ్యారు. కానీ రాష్ట్ర అధ్యక్షుడు సూచన మేరకు రామరాజు పైన పెట్టిన కేసును తిరిగి వాపసు తీసుకునేందుకు సీనియర్​ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్​, గోలి మధుసూధన్​ రెడ్డిలు స్టేషన్​ కు వెళ్లారు. స్టేట్​ పార్టీ నుంచి పెద్దలు వచ్చి చర్చిస్తే తప్పా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రామరాజు స్పష్టం చేశారు.

Share
Share