- సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ ప్రకటన వెల్లడైన మాసంగా ప్రత్యేక గుర్తింపు
- అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోంది: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని నింపిన మాసంగా డిసెంబర్ నెలకు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో జరిగిన క్రిస్మిస్ వేడుకుల్లో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన చేసిన రోజు అని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పుట్టిన రోజు ఒకే రోజు కావడం మన అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి మానవీయ కోణంలో పథకాలు అమలు చేస్తు న్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సీఎం, మంత్రులం సమష్టిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని రెండేళ్లుగా క్రమంగా గాడిన పెడుతున్నామని అన్నారు. యేసు ప్రభువు కృపతో ప్రజలు అంతా ఆనందంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో సాగాలని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, విలియమ్స్, క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.