ఏడాదిలో 4.79 లక్షల మంది పైన కేసులు

  • వాహనదారుల అతిక్రమణలు జెట్ స్పీడ్​
  • ఏడాదిలో 4.79 లక్షల మంది పైన కేసులు 
  • ప్రత్యేక డ్రైవ్​లో పోలీసులకు చిక్కుతున్న వాహనదారులు
  • తాగుబోతుల్లో సైతం అదే వైఖరి
  • నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఒక్క ఏడాదిలో రూ.12.57 కోట్ల జరిమాన

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: వాహనాదారులు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించి పోలీ సులకు చిక్కుతున్నారు. అతివేగం, డ్రైవింగ్​ లైసెన్స్​ లేకపోవడం, ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లఘించడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటి వివిధ రకాల కేసులు ఏటికేడు పెరుగుతున్నాయి. పోలీస్​ శాఖ చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్​లు, పట్టుబడుతున్న కేసులను పరిశీలిస్తే ఆశ్చర్యంకలుగుతోంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో వాహనదారులు రూల్స్​ బ్రేక్​ చేయడం పరిపాటిగా మారిపోయింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఈ రెండు జిల్లాల్లో కలిపి 4,79,834 కేసులు ఎంవీఐ(MVI) యాక్ట్​ కింద నమోదు చేశారు. 2024లో 3,91,427 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 88, 407 కేసులు పెరగడం గమనార్హం. కేసులు నమోదు చేయడంతో పాటు భారీ ఎత్తున జరిమాన విధిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం సమకూరుతోంది.

drunk driving

2024లో 12.87 కోట్ల ఆదాయం వస్తే 2025 జనవరి నుంచి డిసెంబర్​ 20 నాటికి రూ.12.57 కోట్ల జరిమానా విధించారు. ఇక మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. 2024 లో డ్రంకెన్​ డ్రైవ్​ కింద రెండు జిల్లాల్లో కలిపి 24,450 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్​ 20 వరకు 34,253 కేసులు డ్రంకెన్​ డ్రై వ్​ కింద నమోదు చేశారు. గతేడాదితో పోలిస్తే 9,803 కేసులు పెరిగాయి. వీటి ద్వారా కేవలం సూర్యాపేట జిల్లాకు గతేడాది రూ.72 లక్షల జరిమాన విధించగా, ఈ ఏడాది రూ.69.24 లక్షల జరిమాన విధించారు. నల్లగొండ జిల్లాలో డ్రంకెన్​ డ్రైవ్​ కింద పెండింగ్​ కేసులు చాలానే ఉన్నాయి. గతేడాది 11,692 కేసుల్లో 8,265 మంది నుంచి జరిమాన వసూలు చేయగా, ఇంకా 3,431 కేసుల పెండింగ్​లో ఉన్నాయి. ఈ ఏడాది 21,813 కేసుల్లో 13,798 కేసుల్లో జరిమాన వసూలు చేయగా, ఇంకా 8,015 కేసులు పెండింగ్​లో ఉన్నాయి.

ఎంవీఐ యాక్ట్​ కింద నమోదైన కేసులు…

జిల్లాపేరు2024జరిమాన2025జరిమాన
నల్లగొండ1,58,138రూ.5,33,94,6202,13,137రూ.5,48,53,330
సూర్యాపేట2,33,289రూ.7,53,47,5002,66,697రూ.7,08,77,065
డ్రంకెన్​డ్రైవ్​:    
నల్లగొండ11,69621,813
సూర్యాపేట12,754రూ.72,07,32112,440రూ.69,24,058
Share
Share