Sarpanch Elections: మూడు మండలాల్లో కాంగ్రెస్​ వర్సెస్​ బీఆర్​ఎస్

  • ఆరు మండలాల్లో 120 పంచాయతీల్లో.. 57 కాంగ్రెస్​, 23 బీఆర్​ఎస్​
  • మోతె, మునగాల, అనంతగిరిలో పోటాపోటీ..చిలుకూరు, నడిగూడెం, కోదాడలో కాంగ్రెస్​ హవా

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​ : కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య మూడు మండలాల్లో గట్టిపోటీ జరిగింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్​ చిలుకూరు, నడిగూడెం, కోదాడలో సత్తాచాటింది. మోతె, మునగాల, అనంతగిరి మండలాల్లో బీఆర్​ఎస్​ మెజార్టీ పంచాయతీలను సొంతం చేసుకుంది. మొత్తం 120 పంచాయతీల్లో కాంగ్రెస్​ 58, బీఆర్​ఎస్​ 23, స్వతంత్రులు 8 మంది గెలుపొందారు. కేవలం ఐదు ఓట్ల మెజార్టీతో మునగాల కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపొందగా, మూడు ఓట్ల తేడాతో గుంజలూరు సర్పంచ్​ గెలిచారు. కాంగ్రెస్​ అత్యధికంగా అనంతగిరి మండలంలో 11, కోదాడ మండలంలో 12, మోతె మండలంలో 10 పంచాయతీల్లో గెలుపొందగా, బీఆర్​ఎస్​ అనంతగిరిలో 4, మునగాలలో 6, మోతె మండలంలో 8 పంచాయతీల్లో అభ్యర్థులు గెలిచారు. ఇదే మండలంలో స్వతంత్రులు సైతం 4 గురు గెలుపొందడం గమనార్హం.

మండలం పేరుకాంగ్రెస్బీఆర్​ఎస్
అనంతగిరి114
చిలుకూరు81
నడిగూడెం83
మునగాల96
కోదాడ121
మోతె108
Share
Share