హైదరాబాద్(APB News): రాఖీ పండుగ అన్న-చెల్లెళ్ల బంధానికి ప్రతీక అని, రక్షా బంధన్ ప్రతి మహిళా జీవితంలో ఆనందం నింపాలని తెలంగాణ గ్రంథాలయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోమటి మత్స్య గిరి అన్నారు .
రాఖీ పౌర్ణమి సందర్భంగా తన ఐదుగురు సోదరీమణులు అయినటువంటి గొడుగు విజయ,వాడపల్లి పద్మ, బొల్లెపల్లి పద్మ, నల్లా యాకమ్మ,ధనమ్మ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కోమటి మత్స్యగిరి సోదరీమణులు మాట్లాడుతూ మత్స్యగిరి కి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, విజయాలు, సిరి సంపదనలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కోమటి మత్స్యగిరి మాట్లాడుతూ
అక్క తమ్ముడు అన్నా చెల్లెళ్ళ మధ్య అపారమైన ప్రేమను సూచించే ఈ రాఖీ పండుగ సౌభ్రాతృత్వం వెల్లివిరిసేల ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి అని అన్నారు.రాఖీ పండుగ అనేది ప్రేమ, స్నేహం, రక్షణ విలువలను గుర్తు చేసే పర్వదినం. ఈ రాఖీ పండుగ ప్రతి ఇంట్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలి అని కోమటి మత్స్యగిరి కోరారు.
పవిత్ర రాఖీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ కోమటి మత్స్యగిరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తనకు రాఖీలు కట్టిన సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు.