సిద్దిపేట(APB News): కొమురవెళ్లి మండలం తపాస్ పల్లి రిజర్వాయర్ ద్వార చెరువులు,కుంటలు నింపి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

బుధవారం తపాస్ పల్లి రిజర్వాయర్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శిచారు..ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తపాస్ పల్లి రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయకపోవడంతో రిజర్వయర్ లో నీటి శాతం పూర్తిగా పడిపోయాయి.. దాంతో చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటి పోవడంతో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ధర్మసాగర్, బొమ్మకూరు నుండి నీటిని విడుదల చేసి ఈ ప్రాంతంలో ఉన్న కుడి,ఎడమ కాలువల ద్వార నీటిని మళ్లించి రైతుల పంటలకు సాగునీరు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రిజర్వాయర్ లోకి నీటి మల్లింపులో జరుగుతున్న ఇబ్బందులను నీటి పారుదలశాఖ అధికారులతో మాట్లాడి నీటి సమస్య లేకుండా చూస్తానని అలాగే ఈ ప్రాంత రైతులు,అధికారులతో సమీక్షలు నిర్వహించి వారి అభిప్రాయాలతో నీటి సరఫరాలో జరుగుతున్న సమస్యలను పరిష్కరించి రానున్న ఎండకాలంలో అన్ని ప్రాంతాల రైతులకు సాగు,తాగునీటి కష్టాలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల,కమలాయపల్లి గ్రామాల్లో పర్యటించి తపాస్ పల్లి రిజర్వాయర్కు సంభందించిన D3,రంగనాయక్ సాగర్ LD10 కాలువలను పరిశీలించి స్థానిక రైతులు,అధికారులతో చర్చించి సాగు నీటి సమస్యలు లేకుండా చూడాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

