రంజాన్ మాస సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి
మహేశ్వరం నియోజకవర్గం లోని జలపల్లి మున్సిపాలిటీ ప్రీమియర్ ఫంక్షన్ హాల్ లో రంజాన్ మాసం సమీపిస్తున్న సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ జలపల్లి మున్సిపాలిటీలో 198 ప్రార్థన మందిరాలు ఉన్నవి అన్ని ప్రాంతాల్లో కూడా మంచినీటి సరఫరా సానిటేషన్ మరియు డ్రైనేజ్ వ్యవస్థను, విద్యుత్ అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు.
ఈద్గా మసీదులు జలపల్లి మున్సిపాలిటీలో 7 ఏర్పాటు చేయడం జరిగిందని అవి ఎప్పటికప్పుడు పరిశీలించి పండగ వస్తేనే పట్టించుకోవడం లాంటిది కాకుండా పక్క ప్రణాళిక ద్వారా ఎప్పుడైనా సరే అవి వారికి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఎన్నికల కంటే ముందు ఇప్పుడున్న ప్రభుత్వం ముస్లిం ప్రార్థన మందిరాలకు ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి కూడా 14 నెలలు గడిచిన వారికి అందజేయలేదని తక్షణమే వారికి ఉచిత విద్యుత్ అందించాలని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మస్జిద్ లో పనిచేసే ఇమామ్, mozam లకు నెలసరి వేతనం అందజేసేవారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వారి వేతనాన్ని ఆపివేయడం జరిగిందని తక్షణమే వారందరి కూడా వేతనాన్ని అందించాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు జలపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.