బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు రేఖ బోయలపల్లి
BRS పార్టీ మాజి మంత్రి సూర్యాపేట MLA గుంతకంట్ల జగదీశ్ రెడ్డి నిన్న BRS భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి పసలేని ఆరోపణలు చేసారు. ఆయన ఏమి అంటున్నాడు అంటే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కాపలా కుక్కలాగా ఉంటది అని అంటుంటే నాకైతే కెసిఆర్ గారి గత డైలాగ్ గుర్తొస్తున్నాది ఆయన కూడా తెలంగాణకి కాపలా కుక్కలాగా ఉంటానని నమ్మించి మోసం చేసి తొమ్మిది సంవత్సరాలు అధికారం అనుభవించి విభజన హామీలు గాలికి వదిలేసి నీటి సమస్యను పరిష్కరించకుండా లక్షల కోట్లు దోచుకున్నాడు.
మాయమాటలు చెప్పిన మీ ప్రభుత్వమే 9 సంవత్సరాలు అధికారం చలాయించింది మమ్మల్ని ప్రజలు అభిష్టంతో అధికారం ఇచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కచ్చితంగా ఇంకో 20 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాము. 9 సంవత్సరాలు సూర్యాపేట జిల్లాలో ఇసుక మాఫియా నడిపి ఇప్పుడు ఏమి తెలియనట్లు మాట్లాడుతున్నావు.
కృష్ణ జలాల లాంటి పెద్ద పెద్ద మాటలెందుకులే గాని…కాళేశ్వరం అని చెప్పి కాళేశ్వరం కట్టిన మీ స్వయం ప్రకిట ఇంజినీర్ కెసిఆర్ రంగనాయక సాగర్ ద్వారా నేరుగా తన ఫామ్ హౌస్ కి నీళ్లు మళ్లీస్తే…నువ్ తక్కువోడివా….నువ్ ఫణిగిరి దగ్గర నుండి వచ్చే 3R SRSP కాలువను నేరుగా నీ తమ్ముడి రొయ్యల చెరువుకు మల్లించి సొంత ఊరు రైతుల నోట్లో మట్టి కొట్టి గురువు తగ్గ శిష్యునివి అనిపించుకున్నారు ఇవాళ మీరు కూడ నీతులు చెప్తున్నారు జగదీశ్ రెడ్డి. కృష్ణ జలాల్లో 299 టీఎంసీ లు చాలు అని మీ నాయకుడు కెసిఆర్అంటే మీరేమో 350 టీఎంసీ లు తేవాలి అంటున్నారు. జగన్ ఉన్నప్పుడు కెసిఆర్ నోరుమూసుకుని ఉన్నారు. పోతిరెడ్డిపాడు నుండి నీళ్లు తరలిస్తుంటే కెసిఆర్ సైలెంట్ గా ఎందుకు ఉన్నారు. ప్రగతి భవన్ లో జగన్ కి పంచాభక్షా పరమాన్నం పెట్టి తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది వాస్తవం కదా జగదీశ్ రెడ్డి గారు ..???
పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పక్కనపెట్టి కమిషన్ కోసం కాలేశ్వరం కట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఏపీతో మనకి ఇప్పుడు నీళ్ల పంచాయతీ ఉండేది కాదు. నీళ్లు నిధులు నియామకాలు అని తెలంగాణ సాధించాక నీళ్లు రాయలసీమ కి తరలించి నియామకాలు నిధులు మీ కుటుంబ సభ్యులు పంచుకొని ఏడు లక్షల కోట్ల అప్పు చేశారు.
అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కమిషన్ల కు కేర్ ఆఫ్ అడ్రస్ అని జనం కోడై కూస్తున్నారు అందుకే మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చో పెట్టారు. అసలు మీరు మంత్రి గా పనిచేసిన విద్యుత్ శాఖ లో జరిగిన అవినీతి గురించి కమిషన్ల సంగతి కూడా త్వరలోనే తెలుస్తాం అని జగదీష్ రెడ్డి పై రేఖ మండిపడ్డారు.