ప్రయాగ్రాజ్(APB News): ముధోల్ నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ మహా కుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు గత కొన్ని రోజుల నుండి మహా కుంభమేళ జరుగుతున్న నేపథ్యంలో మన దేశం నుండే కాకుండా విదేశాల నుండి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనగా ఇప్పటికే 50 కోట్ల పైచిలుకు భక్తులు స్నానాలు ఆచరించిన విషయం విధితమే.
అయితే ఈ నేపథ్యంలో మంగళవారం ముధోల్ ఎమ్మెల్యే తమ సహచరులతో కలిసి ప్రయాగ్రాజ్ త్రివేణి సంఘమంలో స్నానాలు ఆచరించి మహా కుంభమేళలోని పాల్గొని ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. వీరి వెంట బాసర మాజీ జడ్పిటిసి రమేష్, సోలంకి భీమ్రావు పటేల్, సతీష్, విజయకుమార్ NRI, తమ సహచర సభ్యులతో కలిసి ఉన్న స్నానం ఆచరించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.