ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి కాంగ్రెస్ నాయకురాలు బోయినపల్లి రేఖ స్ట్రాంగ్ రిప్లై

సూర్యాపేట(APB News): అధికారంలో ఉన్నప్పుడు మరియు అంతకుముందు ఏనాడూ కూడా దురాజ్పల్లి లింగమంతుల స్వామిని కవిత దర్శించుకున్నది లేదు, బోనం పెట్టింది లేదు. రాజకీయం చేయడం కోసమే వచ్చి బోనం పెట్టింది. అధికారంలో ఉన్నప్పుడు మహిళల్ని, ప్రజల్ని, రైతుల్ని పట్టించుకోని కవిత ఇప్పుడు చిలక పలుకులు పలుకుతుంది. అమ్మ కవిత ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళల కోసం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.

ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ మహిళలను కోటీశ్వరులు చేయాలని దృఢ సంకల్పంతో మొదటి దశలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాట్లు చేశారు. ఆడబిడ్డల భద్రత కోసం T సేఫ్ యాప్ తయారు చేయడం జరిగింది. మహిళా సంఘాల ద్వారా మహిళల కోసం మొదటి దశలో 150 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. మహిళా సంఘాల బలోపేతానికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంచార చేపల విక్రయాల కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రైతుల కోసం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి ఎకరాకి 12,000 రైతు భరోసా ఇచ్చి సన్నాలకి క్వింటాలు 500 రూపాయలు బోనస్ ఇచ్చి భూమిలేని పేద రైతులకు రైతు ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వేల రూపాయలు ప్రజా ప్రభుత్వం ఇస్తుంది. కనీవిని ఎరగని రీతిలో 66.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం.

కృష్ణా జలాల్లో 811 టిఎంసిలకి 299 టీఎంసీలకు సంతకం పెట్టింది కేసీఆర్ కాదా..? నెహ్రు హయాంలో కట్టిన నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు ఎన్ని వరదలు వచ్చినా తట్టుకోని నిలబడలేదా..?? కాలేశ్వరం మ్యాన్ మేడ్ వండర్ అయితే ఎలా కులింది..?? పోతిరెడ్డిపాడు నుండి ఏపీ నీటిని దోపిడీ చేస్తుంటే హరీష్ రావు ఎందుకు ప్రశ్నించలేదు..? రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియ పూర్తయ్య దాకా ఎపెక్స్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టింది నిజం కాదా..? మీ నాన్న కేసీఆర్ రోజా ఇంటికి వెళ్లి రొయ్యల వేపుడు తిని రాయలసీమ ని సస్యశ్యామలం చేస్తా అన్నది నిజం కాదా ఇది ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా మీరు..?? ఇప్పటికే మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు పెద్దగట్టు ఆలయా అభివృద్ధి కి 70 కోట్లు ఇచ్చి పనులు మొదలు పెడతాం అని చెప్పారు. ఒకసారి గత చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే స్థాయి కవిత కి లేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు బోయలపల్లి రేఖ ఫైర్ అయ్యారు.

Share
Share