కొత్తకోట(APB News):
కొత్తకోట ప్రీమియర్ లీగ్ ప్రీమియర్ లీగ్ -01క్రికెట్ పోటీలను క్రీడా మైదానం లో దేవరకద్ర ఎమ్మేల్యే జి. మధుసూదన్ రెడ్డి(GMR) బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ముందుగా పూల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించి, జాతీయ గీతాన్ని ఆలపించికొవ్వొత్తులను వెలిగించి,ఈ పోటీలను ప్రారంభించడం జరిగింది.

విజేతలకు ప్రథమ బహుమతిగా 1లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి 50000రూపాయలు, షీల్డులు అందజేస్తారు. తొలి మ్యాచ్ 90s వర్సెస్ NS11 జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు టాస్ వేసినా మాజీ శాసన సభ్యులు రావుల రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.

కొత్తకోట ప్రీమియర్ లీగ్- 01 అట్టహాసంగా ప్రారంభమై ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో కూడా మంచిగా రాణించి రాష్ట్ర,దేశ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని కోరారు.భవిష్యత్ లో క్రీడాల్లో రాణించడం వలన ఉద్యోగ అవకాశలు కూడా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు.


అనంతరం రాఘవేంద్ర స్వామి టెంపుల్ లో ఉడిపి పీఠాధిపతి స్వామి ఆద్వర్యంలో నిర్వహించినా ప్రత్యక పూజలో పాల్గొన్నా దేవరకద్ర ఎమ్మేల్యే జి. మధుసూదన్ రెడ్డి(GMR).

తదనంతరం బీపీఆర్ గార్డెన్లో జనుంపల్లి సునీల్ కుమార్ వెడ్స్ కళ్యాణి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించినా ఎమ్మేల్యే జి మధుసూదన్ రెడ్డి(GMR).
