తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేసిన కులగణన దేశానికే ఆదర్శం: బోయలపల్లి రేఖ

  • కులగణన సర్వే ని అసెంబ్లీ ఆమోదించడం హర్షనీయం.
  • కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసి ఇచ్చిన మాట నిలుపుకుంది మా ప్రజా ప్రభుత్వం.

సూర్యాపేట(APB News): దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని పని మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను. తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు తగదు. సమగ్ర కుటుంబ సర్వేను BRS పార్టీ రాజకీయం కోసం వాడుకుంది. సమగ్ర కుటుంబ సర్వే డేటా ని అసెంబ్లీలో పెట్టకుండా, కనీసం ప్రజలకు కూడా తెలియజేయలేదు. కులగణన సర్వేలో పాల్గొనని కల్వకుంట్ల ఫ్యామిలీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన దేశవ్యాప్తంగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కులగణన ద్వారా అన్ని వర్గాల ప్రజలకి సమాన న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నాను. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలు అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకురాలు బోయలపల్లి రేఖ హెచ్చరించింది.

Share
Share