కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో బీసీ కులగన చేస్తుంది. పదేళ్ల పాలనలో ధర్నా చౌక్ ని లేకుండా చేసి బీసీలను విస్మరించిన ఘనత బిఆర్ఎస్ పార్టీది. కవిత గారు బి సి లకోసం ధర్నా చేయడం విడ్డురంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసే బీసీ కులగనన మేము ధర్నా చేయడం వలనే చేసిందని చెప్పుకోవడానికే ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. ఇందిరా పార్కులో కాదు మీ నాయన ఫామ్ హౌస్ ముందు ధర్నా చెయ్. గత పది సంవత్సరాలలో బీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవు. బీసీలను విస్మరించింది బిఆర్ఎస్.
హనుమంతరావు, కేశవరావు, డి శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ లాంటి బీసీలకు పెద్ద పీట వేసి పీసీసీ అధ్యక్షుల ను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. మీకు బీసీ ల పట్ల చిత్త శుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్షునిగా బీసీని ప్రకటించండి. రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డిదైనా కాంగ్రెస్ పార్టీది ఒకటే నిర్ణయం ఉంటుంది. వీలైతే మీరు కూడా కులగనన లో భాగస్వాములై సహకరించండి. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించకండి. మీకు ధర్నా చేసే అధికారం లేదు.