మీర్ పేట్ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బి.ఆర్.యస్ పార్టీ ఆదేశానుసారం మహేశ్వరం నియోజకవర్గం బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు నందు గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీమంత్రి, మహేశ్వరం నియోజకవర్గము శాసన సభ్యురాలు పట్లోల్ల సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నిన్న సెక్రటేరియట్ లో కొత్తగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపాన్ని మార్చడం మనం అందరం గమనించాలి, అసలు తెలంగాణ తల్లి రూపాన్ని ఎందుకు మార్చారు అంటే ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఈ విగ్రహాన్ని తెలంగాణ ఉద్యమంలో కే.సి.ఆర్, మేధావులు,ఉద్యమకారులు అందరితో కలిసి చర్చించి తయారు చేయించిన విగ్రహం ఆరోజు ప్రతిష్టాపన చేసిన రోజు ఏనుగులు అన్నింటితో ప్రతిష్టాపన చేసుకున్నాం, ఈరోజు మనం చూస్తే ఈ ప్రభుత్వం కే.సి.ఆర్ నమూనాలను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయడం చూసుకోవచ్చు,అలానే తెలంగాణ ఆడపడుచులు గౌరవం బతుకమ్మని ఈరోజు చేరిపివేయడం,బతుకమ్మ చీరలను మాయం చేయడం చూడవచ్చు,నిన్న తెలంగాణ తల్లిని ఘనంగా ప్రతిష్టాపన చేస్కున్నాము అని చెప్పిన తరుణంలో తెలంగాణ ఆడపడుచులు అయిన ఆశ వర్కర్ల పైన దాడి చేయడం ” దుష్యాసన పర్వాన్ని ” చూసి ఉన్నాము,తెలంగాణ ఉద్యమంలో ఆరోజు కే.సి.ఆర్ ఉద్యమం చేస్తున్నపుడు తెలంగాణ వచ్చుడో కే.సి.ఆర్ సచ్చుడో అన్న నినాదం నిన్న ఫలప్రదం అయిన రోజు అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీర్ పేట్ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్,డిప్యూటీ మేయర్,ఫ్లోర్ లీడర్,కార్పొరేటర్లు,కో- అప్షన్ సభ్యులు బి.ఆర్.యస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మరియు మహేశ్వరం నియోజకవర్గం స్థాయి బి.ఆర్.యస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,అనుబంధ సంఘాల సభ్యులు అందరూ పాల్గొన్నారు.
