సైబర్​ వలలో రూ.39 కోట్లు కల్లాస్

  • రెండేళ్లలో సైబర్ నేరగాళ్లు స్వాహా చేసిన సొమ్ము
  • సదస్సులు పెడుతున్న జనాల్లో మార్పు అంతంత మాత్రమే

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని జనాలు కోట్లు నట్టేట మునిగిపోతున్నారు. పోలీస్ శాఖ ఎన్నిరకాలుగా అవగాహన సదస్సులు పెట్టినప్పటికీ ఏదో ఒక రూపంలో సైబర్ మాయగాళ్ల చేతికి చిక్కుతున్నారు. ప్రపంచంలో ఏమూలన దాగివున్నారో కూడా ఆచూకీ కని పెట్టలేకపోతున్నారు. సైబర్ వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకున్నామనే సమాచారం వీలైనంత త్వరగా సైబర్ సెల్కు కంప్లైట్ చేసిన వారికి మాత్రమే కొద్దిగొప్ప న్యాయం జరుగుతోంది. కానీ అకౌంట్లలో డబ్బులు పోయిన సంగతి ఆలస్యంగా తెలిస్తే మాత్రం హ్యాకర్స్ను కనిపెట్టడం, అకౌంట్ బ్లాక్ చేయడం కుదరడం లేదు. ఇదిలావుంటే బ్యాంకులు బ్లాక్ చేసిన సొమ్మును తిరిగి ఖాతాదారులకు ఇప్పించడం కూడా పెద్ద సవాల్గా మారింది. కోర్టు నుంచి పర్మిషన్లు పొందడం, బ్యాంకులు బ్లాక్ చేసిన సొమ్మును తిరిగి చెల్లించేందుకు నా నా కొర్రీలు పెడుతున్నాయి. దీంతో బాధితులకు సకాలంలో న్యాయం జరగడం లేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు తగ్గినట్టు ఉన్నప్పటికీ డబ్బులు రికవరీ మాత్రం అంత సులభంగా రాబట్టలేకపోతున్నారు.

జిల్లాల వారీగా సైబర్ నేరాలు..

నల్లగొండ20242025
నమోదైన కేసులు235255
పొయిన సొమ్మురూ.16,31,08,000రూ.4,62,03,589
రికవరీరూ.1,25,50,279రూ.1,48,20,918
సూర్యాపేట  
నమోదైన కేసులు185207
కోల్పోయిన డబ్బురూ.7,83,12,781రూ.10,15,69,977
రికవరీరూ.39,04,664రూ.1,07,50,200
Share
Share