తెలంగాణ రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కష్టాలతో ఎన్నికల్లో గెలిచి స్వార్థం కోసం పార్టీని వీడడం సరికాదన్నారు. అదేసమయంలో బాన్సువాడలో ఉప ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు.
కాగా, బాన్సువాడకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్‌ను నందినగర్ నివాసంలో మంగళవారం కలిశారు. ఈ విషయమై వారితో కేటీఆర్ చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. బాన్సువాడలో ఉప ఎన్నిక జరగనుంది. సీనియర్ నాయకుడిగా పోచారంను బీఆర్ఎస్ గౌరవించింది. తనకు అన్ని విధాలా గౌరవం ఉన్నప్పటికీ పార్టీని వీడడం మాత్రం ఆయనకు నష్టమే.
కార్యకర్తల కష్టం,పోరాటాలతో మీద గెలిచి తన స్వార్థం కోసం పార్టీని వీడడం బాధాకరమన్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎంత గొప్పవారైనా వదిలిపెట్టరు. కార్యకర్తలు తప్పకుండా సలహాలు ఇస్తారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అడిగే వారు కూడా లేని దయనీయ పరిస్థితిలో పడ్డారని అన్నారు.